తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం..

ఆగ్నేయ, ఆనుకొని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం, అండమాన్ దీవులపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అక్టోబర్ 23న ఉదయం 05.30 గంటలకు ఆగ్నేయ, ఆనుకొని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. దీనికి సంబంధించిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇది చాలావరకు అదే ప్రాంతంలో కొనసాగి అక్టోబర్ 24న వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ.. అక్టోబర్ 25న మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా, అక్టోబర్ 26 ఉదయం నాటికి పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇది మరింత బలపడి, రాబోయే 2 రోజులలో ఉత్తర ఆంధ్రప్రదేశ్, ఆనుకొని ఉన్న దక్షిణ ఒడిశా తీరాల వైపు పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతుంది..ఆగ్నేయ అరేబియా సముద్రం, దానిని ఆనుకుని ఉన్న లక్షద్వీప్‌పై ఏర్పడిన అల్పపీడన ప్రాంతంతో సంబంధం ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి ఒక ద్రోణి కేరళ మీదుగా ఉత్తర కోస్తా తమిళనాడు వరకు విస్తరించి, సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించింది. ఉత్తర కోస్తా తమిళనాడు, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం పైన పేర్కొన్న ద్రోణితో విలీనమైంది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు..