ఉత్కంఠ మ్యాచ్ లో.. న్యూజిలాండ్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ..!

న్యూజిలాండ్ పర్యటనలో భారత్ జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ భారత్ విజయం సాధించింది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా క్రైస్ట్‌చర్చ్ వేదికగా శనివారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది..తెలుగు తేజాలు తిలక్ వర్మ(26 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 51 నాటౌట్), నితీష్ కుమార్ రెడ్డి(13 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 26 నాటౌట్) అసాధారణ ప్రదర్శనతో అదిరిపోయే విజయాన్ని అందించారు. ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ 2-0తో ఆధిక్యంలో నిలిచింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు చేసింది. గ్లేన్ ఫిలిప్స్(43 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 70), బెవాన్ జాకోబ్స్(46 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 58) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(2/33) రెండు వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్(1/50), ప్రిన్స్ యాదవ్(1/30), నితీష్ కుమార్ రెడ్డి(1/31)తలో వికెట్ తీసారు..అనంతరం భారత్ 19.5 ఓవర్లలో 6 వికెట్లకు 181 పరుగులు చేసి గెలుపొందింది. తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డితో పాటు నమన్ ధీర్(17 బంతుల్లో ఫోర్లు, 2 సిక్స్‌లతో 31) రాణించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్(4/21) నాలుగు వికెట్లు తీయగా.. జాకోబ్ డఫీ, నాథన్ స్మిత్ తలో వికెట్ తీసారు..