తెలుగు రాష్ట్రాల జీవనాడి శ్రీశైలం జలాశయం.
వానాకాలం ముగిసి చలికాలం ప్రారంభంలోనే కృష్ణా బేసిన్‌కు నీటి గండం ముంచుకొచ్చింది. కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు దాదాపు ఖాళీ అయిపోయింది. డెడ్ స్టోరేజీ పోగా, ప్రాజెక్టులో వాడుకోదగిన నీరు కేవలం 3.635 టీఎంసీలే ఉంది. ఈ ఏడాది ఎగువ నుంచి శ్రీశైలానికి దాదాపు 220 టీఎంసీల మేర వరద రాగా.. పెండింగ్ప్రాజెక్టుల కారణంగా తన వాటా మేరకు నీటిని ఎత్తిపోసుకోలేని తెలంగాణ తీవ్రంగా నష్టపోయింది…ఇదే అదనుగా పొరుగు రాష్ట్రం ఏపీ ఏకంగా 60.5 టీఎంసీలను తోడేసుకున్నది. మన రాష్ట్రం కేవలం 19 టీఎంసీల నీళ్లే వాడుకున్నది. శ్రీశైలంలో కరెంట్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్‌కు దాదాపు 140 టీఎంసీల నీళ్లు వచ్చినా.. ప్రస్తుతం సాగర్‌లో డెడ్ స్టోరేజీకి ఎగువన వాడకానికి 52.5 టీఎంసీలే మిగిలాయి. రానున్న వేసవిలో హైదరాబాద్ మహానగరంతోపాటు ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల దాహార్తి తీర్చే భారం పూర్తిగా నాగార్జునసాగర్‌పైనే పడింది. ఈ నీటిలో వాటాకోసం కూడా ఏపీ పేచీపెడ్తే పరిస్థితి ఏమిటనే ఆందోళన వ్యక్తమవుతున్నది….
• తగ్గిపోతున్న నిల్వలు: సాగర్‌లోకి 140 టీఎంసీల నీరు వచ్చినప్పటికీ, ప్రస్తుతం వినియోగానికి కేవలం 52.5 టీఎంసీలే అందుబాటులో ఉండటం రాబోయే ఎండకాలం నాటికి ప్రమాద ఘంటికలను మోగిస్తోంది.
• తాగునీటి సంక్షోభ భయం: హైదరాబాద్ మహానగరంతో పాటు నల్గొండ, ఖమ్మం జిల్లాల ప్రజల తాగునీటి అవసరాలు పూర్తిగా నాగార్జునసాగర్‌పైనే ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ ఏపీ మిగిలిన నీటిలో కూడా వాటా కోసం పట్టుబడితే తీవ్రమైన తాగునీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉంది.