మడ్డువలస జలాశయానికి భారీగా వరద..

తుపాను వర్షాలకు విజయనగరం జిల్లా వంగర మండలంలోని మడ్డువలస జలాశయానికి భారీగా వరద చేరుతోంది. దీంతో ఆరు గేట్లు ఎత్తి 19,750 క్యూసెక్కుల నీటిని నాగావళి నదిలోకి విడుదల చేస్తున్నారు.. ఆరు ప్రధాన గేట్లను పైకెత్తి, 19,750 క్యూసెక్కుల నీటిని దిగువనున్న నాగావళి నదిలోకి విడిచిపెట్టారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలతో నదులు ఉప్పొంగుతున్నాయి. ముఖ్యంగా వేగావతి, సువర్ణముఖీ నదుల ద్వారా భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. ఈ రెండు నదుల ద్వారా సుమారు 10,000 క్యూసెక్కుల వరద నీరు మడ్డువలస జలాశయంలోకి వచ్చి చేరుతోంది. వర్షాల తీవ్రత దృష్ట్యా వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రాజెక్టు అధికారులు ఎప్పటికప్పుడు నీటిమట్టాలను పర్యవేక్షిస్తున్నారు..