ముస్లిం మైనార్టీ విద్యార్థిని, విద్యార్థులు అడ్మిషన్ల కోసం దరఖాస్తు చెయ్యండి..

డైట్ చార్జీలు పెంచి విద్యార్థి , విద్యార్థినీలకు నాణ్యమైన ఆహారం అందించడం జరుగుతుందని…

ఈరోజు సోమవారం జరిగిన సమావేశంలో *ఈ సందర్భంగా ఎన్ ఎస్ యు ఐ పట్టణ అధ్యక్షుడు ఎస్.కె ముస్తఫా, ముస్లిం మైనార్టీ నాయకులు ఎస్కే మోహిన్, లు మాట్లాడుతూ…

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత విద్యను అందించేందుకు మైనార్టీ సొసైటీ గురుకుల రెసిడెన్షియల్ స్కూళ్లలో 2025, 2026 నూతన అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది..

సూర్యాపేట జిల్లాలో తుంగతుర్తి,సూర్యాపేటలో దురాజ్ పల్లి, ల లో బాలుర విద్యార్థులకు మరియు కోదాడలోని *మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలలో ఖాళీగా ఉన్న 5,6,7, తరగతులకు, ఇంటర్మీడియట్ అడ్మిషన్ల కే ముస్లిం మైనార్టీ విద్యార్థిని, విద్యార్థులు,క్రిస్టియన్ మైనార్టీ, సిగ్గులు,జైనులు మైనార్టీ తెగల కింద వచ్చేవారు దరఖాస్తుల ను విద్యార్థిని, విద్యార్థులు, మైనార్టీ గురుకుల పాఠశాలలో నమోదు చేసుకోగలరని లేదా ఆన్లైన్ ద్వారా అయినా దరఖాస్తు చేసుకుని అడ్మిషన్లు పొందగలరని* ఈరోజు పత్రికలకు విడుదల చేసిన ఒక ప్రకటనలు వారి పేర్కొన్నారు….కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని విద్యార్థిని, విద్యార్థుల కు డైట్ చార్జీలు పెంచి నాణ్యమైన విద్యను,ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం కృతనిచ్చేయంతో పనిచేస్తుందని అన్నారు….ఈ కార్యక్రమంలో ముస్లిమ్స్ యువ నాయకులు ఎండి. రాజావలి బాబా, ఎస్.కె యూసఫ్,జానీ, సలీం తదితరులు పాల్గొన్నారు.