నేటి పంచాంగం.. నేటి విశేషం..

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌸పంచాంగం🌸
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 10 – 05 – 2025,
వారం … స్థిరవాసరే ( శనివారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
వసంత ఋతువు,
వైశాఖ మాసం,
శుక్ల పక్షం,

తిథి : *త్రయోదశి* సా4.59 వరకు,
నక్షత్రం : *చిత్ర* రా2.51 వరకు,
యోగం : *సిద్ధి* తె3.52 వరకు,
కరణం : *తైతుల* సా4.59 వరకు,

వర్జ్యం : *ఉ9.11 – 10.57*
దుర్ముహూర్తము : *ఉ5.33 – 7.15,*
అమృతకాలం : *రా7.47 – 9.33,*
రాహుకాలం : *ఉ9.00 – 10.30,*
యమగండం : *మ1.30 – 3.00,*
సూర్యరాశి : మేషం,
చంద్రరాశి : కన్య,
సూర్యోదయం : 5.34,
సూర్యాస్తమయం: 6.17,

*_నేటి మాట_*

*నిత్య జీవితంలో ఆధ్యాత్మిక సాధన ఎలా చేయాలి???…*
_భక్తుని ప్రశ్నకు – గురువు గారు సమాధానం…_
“సర్వకర్మలూ భగవత్ప్రీతిగా చేయాలి”,
“అపుడు మీరు చేసే పనులే భగవంతుని కి పూజగా మారతాయి”.
ఆధ్యాత్మికం వేరు, మనపనులువేరు అని విడిగా చూడకూడదు.
దైవ కార్యాలు, రోజూ చేసుకునే పనులు అన్నీ ఒకటే!…
మనం, పనిచేసేటప్పుడు మన భావాన్ని సరియైన రీతిగా మార్చుకుంటే చాలునన్నమాట!!…

ఉపాధ్యాయులైనా, డాక్టర్ లైనా, వ్యాపారస్తులైనాసరే, ఎంతటి వారలైన దైవం దగ్గరనుండి దూరంగా ఎవరూ వెళ్ళలేరు…

ఒకసారి ఒక ఒకవ్యాపారస్థుడు వచ్చి – నేను దైవాన్ని పూజిస్తాను కానీ నా వద్దకు వచ్చే వినియోగ దారులందరిలో ఏవిధంగా దైవాన్ని దర్శించగలను?
“లాభాలు ఆశించకుండా వ్యాపారాలు చేయాలా “? అని అడిగాడు…

గురువు గారు …
“లాభాలు లేకుండా వ్యాపారం చేయమని నేను చెప్పటంలేదు”…
అందరిలోనూ దైవాన్ని చూడడమంటే, వారి పాదాలకు మోకరిల్లడంకాదు,
*భగవంతుడంటే ఎవరు?*
సత్యము, ధర్మము, శాంతి ప్రేమలే భగవత్ స్వరూపాలు, కాబట్టి మనము జరిపే లావాదేవీ లన్నిటికి, సత్య ధర్మాలను ఆధారం చేసుకుని, మితిమీరి లాభాలను ఆశించి మోసంచేయకుండా ఉండకుంటే చాలు…
అవినీతి కి తావులేకుండా వ్యాపారం నిర్వహిస్తే చాలు…

“వినియోగదారులలో భగవంతుని దర్శించడమంటే ఇదే” అని గురువు గారు వివరించారు…
మరొక భక్తుని ప్రశ్న,
ఎదుటి వాని స్వభావం, వారి దుర్గుణాలూ తెలిసి కూడా వారిలో ఎలా దైవాన్ని చూసి ప్రేమించగలం?

అంటే గురువు గారు “నవ్వుతూ – నేను మిమ్మల్ని ప్రేమించట్లేదూ” అలాగే, అన్నారు.

అదే అత్యుత్తమ ఆధ్యాత్మిక సాధన అవుతుంది, అని సెలవిచ్చారు!!…

*_🌸శుభమస్తు🌸_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏