హైదరాబాద్: ఉప్పల్‌లో దారుణం
ఐదేళ్ల బాలుడిపై అత్యాచారం, హత్య..
ఐదు రోజుల క్రితం కనిపించకుండా పోయిన బాలుడు..
చెట్లపొదల్లో కనిపించిన బాలుడి మృతదేహం
బాలుడిని అత్యాచారం చేసి గొంతునులిమి చంపిన ఖమర్..
ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతపూర్ కేసీఆర్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. మనోజ్ పాండే(5) అనే ఐదేళ్ల బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. కమర్ అనే వ్యక్తి ఈ హత్య చేసినట్లు తెలుస్తుంది. బాలుడు మనోజ్ పాండే (5) ఈనెల 12న కనబడకుండా పోవడంతో ఉప్పల్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది. అయితే కనబడకుండా పోయిన బాలుడు అనూహ్యంగా మృతి చెందికనిపించాడు. ఇందుకు సంబంధించిన వివరాలు పోలీసులు వెల్లడిస్తూ….ఛత్తీస్గడ్ కు చెందిన ఈశ్వర్ పాండే, పులేశ్వరి పాండే దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు ఆడ పిల్లలు పూనం(10), గడియ(8) ఒక బాలుడు మనోజ్ పాండే(5) ఉన్నారు. కుటుంబ సమేతంగా రామంతాపూర్‌లోని కేసీఆర్ నగర్లో ఉంటున్నారు. అక్కడే టింబర్ డిపోలో ఈశ్వర్ పాండే పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అదే టింబర్ డిపోలో బీహార్ కు చెందిన కమర్ అనే మరో వ్యక్తి కూడా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆగస్ట్ 12న బాలుడు మనోజ్ పాండే కిడ్నాప్ అయ్యాడు. బాలుడిని కమర్ కిడ్నాప్ చేసినట్లు పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు సమీపంలోని సీసీ ఫుటేజీని పరిశీలించగా.. బాధిత కుటుంబానికి సమీపంలో ఉంటున్న బిహార్‌కు చెందిన కమర్ అనుమానాస్పదంగా కనిపించాడు. అదుపులోకి తీసుకొని విచారించగా అసలు సంగతి వెలుగులోకి వచ్చింది..
నల్గొండ జిల్లా.
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కు కొనసాగుతున్న వరద…
14 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు…
ఇన్ ఫ్లో : 1,72,800 క్యూసెక్కులు
,ఔట్ ఫ్లో : 1,46,036 క్యూసెక్కులు.
ప్రస్తుత నీటి మట్టం : 587.30 అడుగులు…
పూర్తి స్థాయి నీటి మట్టం : 590 అడుగులు…
పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 312.0450 టీఎంసీలు…
ప్రస్తుత సామర్థ్యం : 305.6838 టీఎంసీలు…
జల విద్యుత్ కేంద్రం లో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి….
నల్గొండ జిల్లా.
మూసి ప్రాజెక్టు సమాచారం….
మూసి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులు…
ప్రస్తుత నీటిమట్టం 641.90 అడుగులు..
ఇన్ ఫ్లో..11861.15 క్యూసెక్కులు…
ఔట్ ఫ్లో…11581.72 క్యూసెక్కులు…
గేట్స్…C2,C3,C4,C5,C6,C7,C8,C10&C12
9 గెట్ల ద్వారా 3 ఫీట్ల మేర పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న మూసి అధికారులు…
ఖమ్మం: వైరా రిజర్వాయర్‌కు భారీగా వరద.
ప్రస్తుత నీటిమట్టం 18.3 అడుగులు..
పూర్తిస్థాయి నీటిమట్టం 20 అడుగులు..
దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన..
తీగలబంజర దగ్గర పొంగిన పగిడేరు వాగు
పల్లిపాడు-ఏన్కూర్ మార్గంలో రాకపోకలు బంద్
తెలంగాణలో నమోదైన వర్షపాతం వివరాలు..
ములుగు గోవిందరావుపేటలో 14.8 సెం.మీ వర్షపాతం
మేడారం 14.2 సెం.మీ, వరంగల్ మేడిపల్లిలో12.5 సెం.మీ
ములుగు-మల్లాపూర్‌లో11.4 సెం.మీ,మంగపేటలో 11.3సెం.మీ
మెదక్ నర్సాపూర్‌లో 10.8 సెం.మీ వర్షపాతం నమోదు..
భద్రాద్రి కొత్తగూడెం మణుగూరులో 8.6 సెం.మీ వర్షపాతం..
HYD: రాజ్‌భవన్ ఏఆర్ కానిస్టేబుల్‌పై కేసు నమోదు..
తనను లైంగికంగా వేధిస్తున్నాడని మహిళ ఆరోపణ
భర్త, పిల్లలను చంపుతానంటూ బెదిరిస్తున్నాడని..
ఏఆర్ కానిస్టేబుల్ వెంకటేష్‌పై మహిళ ఫిర్యాదు
కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్న SRనగర్ పోలీసులు…
రేషన్ బియ్యం కోసం ఇంటి నుంచి బ్యాగులు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు..బ్యాగులు పంపిణీ ..
వచ్చే సెప్టెంబర్ నెల నుంచి రేషన్ బియ్యం కోసం ఇంటి నుంచి బ్యాగులు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే రేషన్‌కార్డుదారులకు వచ్చే నెలలో సన్న బియ్యంతో పాటు పర్యావరణహిత బ్యాగులు పంపిణీ చేయనుంది. ఈ మేరకు జిల్లాల పరిధిలోని ఎంఎల్ఎస్ పాయింట్ల (గోదాము)కు ఇప్పటికే ఈ బ్యాగులు చేరుకున్నాయి. వీటిని ఎంఎల్ఎస్ పాయింట్ల పరిధిలోని రేషన్ డీలర్లకు కార్డుల సంఖ్య ప్రకారం అధికారులు సరఫరా చేస్తారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు పథకాలను ప్రస్తావిస్తూ ‘అందరికీ సన్న బియ్యం ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యం’ అనే నినాదం ఈ పర్యావరణహిత బ్యాగులపై ముద్రించి ఉంది. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం కోసం ప్రభుత్వమే పర్యావరణహిత బ్యాగులను అందజేయబోతోంది. వచ్చే నెలలో అందజేసే ఈ సంచులను ప్రతి నెలా బియ్యం కోసం వెళ్లేటప్పుడు తీసుకెళ్తే సరిపోతుంది..
మార్వాడీలకు మద్దతు తెలిపిన బండి సంజయ్..
గుజరాతీ మార్వాడీలు బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉంటారు కాబట్టే వారిని వ్యతిరేకిస్తున్నారు..
గుజరాతీలు తెలంగాణ సంపద దోచుకోవడానికి రావట్లేదు..
తెలంగాణలో మార్వాడీలు వ్యాపారం చేసుకుంటే తప్పేంటి..
మీరు మార్వాడీ గో బ్యాక్ ఉద్యమాలు చేస్తే, మేం రోహింగ్యాలు గో బ్యాక్ ఆందోళనలు చేస్తాం – బండి సంజయ్..మార్వాడీ గో బ్యాక్ (Marwadi Go Back) ఉద్యమంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) మొదటి సారి స్పందించారు. మార్వాడీ గో బ్యాక్ పేరుతో హిందూ సమాజాన్ని చీల్చే కుట్రలు మొదలయ్యాయని బండి సంజయ్ ఆరోపించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ యూసుఫ్‌గూడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో కలిసి తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మార్వాడీ గో బ్యాక్ పేరుతో కమ్యూనిస్టుల ముసుగులో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల నాయకులు డ్రామాలాడుతున్నాయని మండిపడ్డారు. మార్వాడీలు వ్యాపారం చేసుకుంటే తప్పేముందని ప్రశ్నించారు. మార్వాడీలు ఏనాడూ అధికారం కోసం పాకులాడలేదని, తెలంగాణను దోచుకోలేదని, వ్యాపారాలు చేసుకుంటూ సంపదను సృష్టించారని తెలిపారు. హిందూ సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నారని, అలాంటి మార్వాడీలు తెలంగాణ నుంచి ఎందుకు వెళ్లిపోవాలని ప్రశ్నించారు. హిందూ కుల వృత్తులను దెబ్బతీసేలా మటన్ షాపులు, డ్రై క్లీనింగ్ షాపులను ఒక వర్గం వారే నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మార్వాడీ గో బ్యాక్ ఉద్యమాలు చేస్తే.. బీజేపీ పక్షాన ఒక వర్గం నిర్వహించే మటన్ షాపులు, డ్రై క్లీనింగ్ షాపులకు వ్యతిరేకంగా హిందూ కుల వృత్తులను కాపాడుకునేందుకు పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. దీంతో పాటు రోహింగ్యాల (Rohingya) గో బ్యాక్ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తేల్చి చెప్పారు…
పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు, చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ ..!
పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు, చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వారిపై పన్ను భారాన్ని తగ్గించేందుకు దృష్టిసారించింది. ఈ క్రమంలో దాదాపు ఎనిమిదేళ్ల తరువాత జీఎస్టీ (GST Slabs) విధానానికి కీలక సవరణలు చేసేందుకు శ్రీకారం చుట్టింది..ప్రస్తుతం అమల్లో ఉన్న నాలుగు స్లాబ్‌లు.. ఇకపై రెండు స్లాబ్లకు జీఎస్టీ (GST Slabs)ని పరిమితం చేయాలని కేంద్రం భావిస్తుంది. ఇందుకోసం చకచకా పనులు జరుగుతున్నాయి. అంతా అనుకున్నట్లు జరిగితే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పెట్టాలని మోదీ సర్కార్ ఆలోచన చేస్తోంది.
ప్రస్తుతం జీఎస్టీలో 5శాతం, 12శాతం, 18శాతం, 28శాతం స్లాబ్‌లు ఉన్నాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతిపాదన ప్రకారం.. ప్రస్తుతం ఉన్న నాలుగు స్లాబ్‌ల స్థానంలో 5శాతం, 18శాతం అనే రెండు స్లాబ్‌లు మాత్రమే కొనసాగనున్నాయి. పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు ఉపయోగించే వస్తువుల్లో 99శాతం (ప్రస్తుతం 12శాతం స్లాబ్‌లో ఉన్నవి) 5శాతం స్లాబ్‌లోకి మారనున్నాయి…అలాగే 28శాతం స్లాబ్‌లో ఉన్న 90శాతం వస్తువులు 18శాతం స్లాబ్ లోకి వస్తాయి. కొన్ని ప్రత్యేక వస్తువులకు మాత్రమే ప్రత్యేక రేట్లు వర్తిస్తాయి. తదుపరి జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో జరగనుంది. కానీ, కచ్చితమైన తేదీలను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవం ప్రసంగం తరువాత ఈ ప్రతిపాదన వచ్చింది. దీపావళి నాటికి జీఎస్టీలో తదుపరి తరం సంస్కరణలు వస్తాయని, సామాన్య ప్రజలకు గణనీయమైన పన్ను ఉపశమనం కలుగుతుందని, చిన్న వ్యాపారులకు లాభం చేకూరుతుందని చెప్పారు.
ప్రభుత్వం జీఎస్టీ రేట్ల సరళీకరణ, సంస్కరణలపై తన ప్రతిపాదనను జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు చేసిన మంత్రుల బృందానికి పంపింది. ప్రస్తుతం 12శాతం స్లాబ్‌లో 99శాతం వస్తువులు 5శాతం స్లాబులోకి రానున్నాయి. 28శాతం పన్ను స్లాబులో ఉన్న 90శాతం వస్తువులు 18శాతానికి మారుతాయా అనేది వేచి చూడాల్సిందే.
అన్నివర్గాల ప్రజలకు, ముఖ్యంగా సామాన్యులు, మహిళలు, విద్యార్థులు, మధ్య తరగతి, రైతులకు లాభం కలిగించేలా పన్ను రేట్లను సులభం చేయనున్నారు. సవరించిన జీఎస్టీ విధానంలో జౌళి, ఎరువులు, ఫునరుత్పాదక విద్యుత్తు, ఆటోమోటీవ్, హస్తకళలు, వ్యవసాయం, వైద్యం, బీమా రంగాలకు లాభం చేకూర్చనుంది.
ఈ సవరణ వినిమయానికి ఊతమందిస్తుందని, పెరిగిన వినిమయం కారణంగా పన్ను చెల్లింపులు పెరిగి తగ్గిన పన్నుల కారణంగా కలిగే నష్టాన్ని భర్తీ చేస్తుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
కొత్త జీఎస్టీ విధానంలో హానికారక వస్తువులపై 40శాతం ప్రత్యేక పన్ను విధించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ శ్రేణి పొగాకుతో సహా కేవలం ఏడు వస్తువులు, సేవలకు మాత్రమే వర్తిస్తుంది. ఆన్లైన్ గేమింగ్ ప్రక్రియను హానికారక సేవల శ్రేణిలో చేర్చే అవకాశం ఉంది..