హెడ్ కానిస్టేబుల్ షేక్ బహారలి కు పోలీస్ సేవా పతకం..

హెడ్ కానిస్టేబుల్ కు షేక్ బహారలి పోలీస్ సేవా పతకం….
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం ఇచ్చే పతకాలలో కేటీపీస్ పాల్వంచ యూనిట్ నందు ఖమ్మం లో వున్న UBICC కరెన్సీ చేస్ట్ నందు విధి నిర్వహణలు చేయుచున్న 1998 బ్యాచ్ కి చెందిన తెలంగాణ ప్రత్యేక రక్షణ దళం హెడ్ కాన్స్టేబుల్,షేక్ బహారలి గారి విధి నిర్వహణలు సేవలను గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సేవా పతకం, (తెలంగాణ పోలీస్ సేవా పతకం) ప్రకటించినది.. సమాజ సేవలో ముందుంటూ,, ఎన్నో సంవత్సరాల అనుభవం కలిగిన యోగా.. దీర్ఘకాలిక వ్యాధులకు ఉచితంగా ఆయుర్వేద మందులను కూడా సప్లై చేస్తూ అందరి ఆరోగ్యాలతో పాటు, మంచిని కోరే..కల్లూరు మునిసిపల్టీ,ఖమ్మం జిల్లా కు చెందిన షేక్ బహారలి కి ఇలాంటి సత్కారం జరగటం చాలా సంతోషకరమని హర్షం వ్యక్తం చేస్తున్నారు.. స్వాతంత్ర దినోత్సవ సందర్బంగా శుక్రవారం నాడు హైదరాబాద్ లో హోమ్ శాఖ ప్రిన్సిపాల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా ఐ,పి,ఎస్, మరియు తెలంగాణ పోలీస్ & ప్రత్యేక రక్షణ దళం,డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్, Dr, అనిల్ కుమార్ ఐ,పి,ఎస్, ఈ పతకాన్ని అందచేసినారు.ఈ కార్యక్రమంలో మాధవరావు DIG, , అన్వర్ పాషా కమాండంట్, ,దేవి దాసు కమాండంట్, త్రినాథ్ కమాండంట్, జంగయ్య కమాండంట్, బ్రహ్మ చారి, అడిషనల్ కమాండంట్, బాబురావు. అసిస్టెంట్ కమాండంట్, చంద్ర శేఖర్ అసిస్టెంట్ కమాండంట్,ఇన్స్పెక్టర్ సన్యాసిరావు ఇంకా అధికారులు నా తోటి ఉద్యోగులు పాల్గొన్నారు.