పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత దట్టంగా అలుముకున్న పొగమంచు…!

అల్లూరి: పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత
దట్టంగా అలుముకున్న పొగమంచు.

మినుములూరులో 5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు.

అరకులో 6, పాడేరు 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
చింతపల్లిలో 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు..

మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు రోజురోజుకు దిగజారుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు సింగిల్‌ డిజిట్‌లో కొనసాగుతున్నాయి. దీంతో చలి తీవ్ర ప్రభావం చూపుతోంది. శనివారం జి.మాడుగులలో 5.1 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా ముంచంగిపుట్టులో 6.8, పెదబయలులో 9.0, చింతపల్లిలో 9.4, పాడేరులో 9.9, అరకులోయలో 10.0, హుకుంపేటలో 10.7, కొయ్యూరులో 12.8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి..
ఏజెన్సీలో గత కొన్ని రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతుండడంతో ఏజెన్సీ వాసులు గజగజ వణుకుతున్నారు. ఉదయం పది గంటలు దాటే వరకు దట్టంగా పొగ మంచు కురుస్తుండగా.. మధ్యాహ్నం ఒక మోస్తరుగా ఎండ కాస్తున్నది. దీంతో రాత్రి పగలు తేడా లేకుండా చలి వణికిస్తోంది. జనం ఉన్ని దుస్తులు ధరిస్తూ, చలి మంటలు వేసుకుంటూ తాజా పరిస్థితులను నుంచి రక్షణ పొందుతున్నారు. అలాగే పర్యాటకులు సైతం మన్యానికి విచ్చేసి చలి, మంచు వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు.

గమనిక..
A TO Z వార్తలు ఏదైనా..
మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959