ISSలో వ్యోమగామికి తీవ్ర అనారోగ్యం
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో మెడికల్ ఎమర్జెన్సీ తలెత్తింది. దీంతో నలుగురితో కూడిన ఆస్ట్రోనాట్ల బృందం ఒక నెల ముందుగానే తమ మిషన్‌ను తగ్గించుకొని భూమిపైకి చేరుకుంటుందని నాసా ప్రకటించింది. ఒక వ్యోమగామికి తీవ్రమైన అనారోగ్యం తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే అత్యవసర తరలింపు కాదని నాసా అధికారి ఒకరు తెలిపారు. అనారోగ్యానికి గురైన వ్యోమగామి పేరును నాసా వెల్లడించలేదు. ఇలా తమ మిషన్‌ను తగ్గించుకోవడం నాసా చరిత్రలోనే ఇదే తొలిసారి…
ఓ పరిస్థితి నెలకొంది. ‘క్రూ-11’ మిషన్‌లో భాగంగా అక్కడ ఉన్న ఒక వ్యోమగామికి హఠాత్తుగా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (NASA).. ముందస్తుగా నిర్ణయించిన స్పేస్‌వాక్‌ను నిరవధికంగా వాయిదా వేయడమే కాకుండా, సదరు వ్యోమగామిని సాధ్యమైనంత త్వరగా భూమికి చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది..జనవరి 8వ తేదీన వ్యోమగాములు మైక్ ఫిన్సీ, జెనా కార్డ్మన్లు సుమారు 6.5 గంటల పాటు అంతరిక్షంలో నడవాల్సి ఉంది. ఇది ఈ ఏడాదిలో జరగాల్సిన తొలి స్పేస్‌వాక్. అయితే క్రూ-11 బృందంలోని ఒక సభ్యుడికి తీవ్రమైన అనారోగ్య సమస్య తలెత్తడంతో నాసా ఈ ప్రయోగాన్ని నిలిపి వేసింది. జనవరి 15వ తేదీన జరగాల్సిన రెండో స్పేస్‌వాక్ పైన కూడా ఇప్పుడు నీలినీడలు కమ్ముకున్నాయి..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959