సంక్రాంతి పండుగ ప్రత్యేక బస్సులు.. పెరిగిన బస్ చార్జీలు..!

ఉప్పల్ x రోడ్డు వద్ద బస్సు కోసం జనం ఇక్కట్లు

టికెట్ ధర రూ.50 పెరిగిందని.. కనీసం సమయానికి బస్సులు లేవంటూ మండిపాటు.

సంక్రాంతి పండుగ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) పూర్తి స్థాయిలో సన్నద్దమైంది. ఈ పండుగకు 6431 ప్రత్యేక బస్సులను నడపాలని యాజమాన్యం ఇప్పటికే నిర్ణయించింది. ప్రధానంగా ఈ నెల 9, 10, 12, 13 తేదీల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆయా రోజుల్లో రద్దీ మేరకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచేలా ప్లాన్ చేసింది. అలాగే, ఈ నెల 18, 19 తేదీల్లో తిరుగు ప్రయాణ రద్దీకి సంబంధించి తగిన ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ లో రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్బీ, బోయిన్పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతోంది..

హైదరాబాద్‌లోని ముఖ్య కేంద్రాల నుంచి ఈ ప్రత్యేక బస్సు సర్వీసులు నడుస్తాయని తెలిపారు. ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్, మియాపూర్, కేపీహెచ్‌బీ, గచ్చిబౌలి వంటి హైదరాబాద్‌లోని ప్రధాన రద్దీ ప్రాంతాల నుంచి ఈ స్పెషల్ బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు..

ప్రయాణికుల సౌకర్యం కోసం.. అన్ని బస్టాండ్ల వద్ద తాగునీరు, నీడ కోసం పండల్స్, కుర్చీలు, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులు తమ సీట్లను www.tgsrtcbus.in వెబ్‌సైట్‌లో ముందస్తుగా రిజర్వ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. సందేహాలు, సహాయం కోసం 040-69440000, 040-23450033 నంబర్లను సంప్రదించవచ్చని వెల్లడించారు..

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959