బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు..!

హుజూర్నగర్ పట్టణంలోని
అసోసియేషన్ కు మార్చ్ 9వ తేదీన జరగబోయే ఎలక్షన్ కు నామినేష న్ లను జక్కుల వీరయ్య ప్యానెల్ నుండి ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ గా సీనియర్ న్యాయవాది కొణతం శ్రీనివాస్ రెడ్డి, నగేష్ రాథోడ్ తమ నామినేషన్ లను ఎలక్షన్ ఆఫీసర్ రాఘవరవు, వట్టికూటి అంజయ్య అదేవిదంగా జాయింట్ సెక్రటరీ గా విజయ దుర్గ,ఎక్సక్యూటివ్ మెంబెర్ గా న్యాయవాది పండ్ల నాగరాజు, కందుల శంబిరెడ్డి నామి నేషన్ లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ప్యానెల్ కు న్యాయవాదులు మద్దతూ తెలిపి గెలిపిస్తే బార్ అసోసియేష న్ అభివృద్ధికి పాటుపడుతామని అన్నారు. ప్రతి సభ్యుడికి మెంబర్ షిప్ ఐడి కార్డులు అందించడం. సభ్యుల సంక్షేమం కోసం వెల్ఫేర్ టికెట్స్ సులభంగా అందుబాటులో ఉండేలా చర్యలు చేపడతామని తెలిపారు. బార్కు బ్యాంక్ ఖాతా ప్రారంభించి, బలమైన ట్రెజరీని ఏర్పాటు చేయడం, ఇతర బార్ అసోసియేషన్లతో సమానంగా ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడం. కోర్ట్లో జడ్జిలు విధించే ఖర్చులు బార్ అసోసి యేషన్ ఖాతాకు జమ అయ్యేలా చర్యలు తీసుకొని,ట్రెజరీని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయ వాది కొణతం శ్రీనివాస్ రెడ్డి, జక్కుల వీరయ్య, బి. నాగేశ్వరావు(నగేష్ రాథోడ్), పండ్ల నాగరాజు, శంబిరెడ్డి, విజయ దుర్గ, ఆజమెరా చందు నాయక్ తదితరులు పాల్గొన్నారు