గ్రామ సభకు స్థలం కరువు…!

గ్రామ సభకు స్థలం కరువు..
కూర్చోవడానికి కుర్చీలు లేవు నిలబడడానికి స్థలం లేదు..

ఈ రోజు 99 రోజుల ప్రజా పాలనా -ప్రగతి ప్రణాళికలో ముగింపు గ్రామ సభ ఉపసర్పంచ్ మేడిశెట్టి నర్సింహారావు అధ్యక్షతన గ్రామసభ నిర్వహించడం జరింగింది…

అన్నిషాకాల అధికారులు, పాలకవర్గం, ప్రజలు హాజరువడం జరిగింది. మా గ్రామ పంచాయతీ లో గ్రామ సభ నిర్వహించడానికి స్థలం చాలక ప్రజలు రోడ్డు మీద నిలబడవలసి వస్తుంది…

కనీసం వార్డు సభ్యులు కూడా కూర్చోవడానికి ప్లేస్ లేక బయట ఉండవలసిన దుస్తుతి లో మా గ్రామపంచాయతి కార్యాలయం దుస్థితి ఇప్పటికైనా పై అధికారులు ఈ ఇబ్బంది ని గ్రహించి నూతన గ్రామ పంచాయతీ కి అనుమతి ఇప్పించాగలరు . మాజీ వైస్ ఎంపీపీ పోలనెడి శ్రీనివాసరావు మాట్లాడుతూ మన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా, పారదర్శకంగా మరియు ప్రజల భాగస్వామ్యంతో చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” అనే 99 రోజుల ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమం నేటితో విజయవంతంగా ముగింపు దశకు చేరుకుంది..

ఇందులో ముఖ్యంగా ప్రజల సంక్షేమ, పారిశుధ్య, పరిశుభ్రత, వ్యవసాయం, విద్య, వైద్యం, రోడ్డు భద్రత, డ్రగ్స్, విద్యుత్ లాంటి అనేక అంశాలు మీద గ్రామసభ లు నిర్వహించడం జరిగింది. గ్రామ అభవృద్ధి కి ప్రజల సహకారం కావాలని అన్నారు…