కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య పై తిరగబడ్డ ప్రజలు, మృతుల కుటుంబ సభ్యులు…!


కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య పై తిరగబడ్డ ప్రజలు, మృతుల కుటుంబ సభ్యులు

ధర్నా ప్రాంతం నుండి పరుగెత్తిన ఎమ్మెల్యే

తృటిలో తప్పించుకుని పారిపోయిన కాలె యాదయ్య..

కొనసాగుతున్న మృతుల కుటుంబ సభ్యుల ధర్నా..

ధర్నా ప్రాంతానికి వచ్చిన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి..

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు..

రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసుకు సంబంధించి ఫ్యూచర్ సిటీ సీపీ తరుణ్ జోషి కీలక విషయాలను వెల్లడించారు. రాత్రి హత్య జరిగిందని తమకు సమాచారం వచ్చిందని తెలిపారు. రెండు ప్రాంతాల్లో్ హత్యలు జరిగాయని పేర్కొన్నారు. మొదట షాబాద్‌లోని బాధితురాలి ఇంటికి రాత్రి 11 గంటల సమయంలో నిందితుడు రాజ్ కుమార్ వెళ్లాడని.. అక్కడ బాధితురాలి తల్లిని, నానమ్మను హత్య చేశాడని చెప్పారు.

ఆ తర్వాత బాలికను నగర్‌కుంట దగ్గరకు తీసుకెళ్లి చెరువు దగ్గర హత్య చేశాడని సీపీ తరుణ్ జోషి తెలిపారు. ఆ తర్వాత బాలికను నగర్‌కుంట దగ్గరకు తీసుకెళ్లి చెరువు దగ్గర హత్య చేశాడని సీపీ తరుణ్ జోషి తెలిపారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లి తన భార్య, పిల్లలను చంపేశాడని పేర్కొన్నారు. అనంతరం రాజ్‌కుమార్ తన తల్లిదండ్రులకు కాల్ చేసి ఆరుగురిని చంపేశానని.. తాను కూడా చనిపోతున్నానని తెలిపాడన్నారు. తమకు సమాచారం రావడంతో ఘటనాస్థలికి వెళ్లి మృతదేహాలను ఆస్పత్రికి తరలించామని తెలిపారు. రాజ్‌కుమార్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. అతని కోసం ఏడు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామని చెప్పారు. భార్యాపిల్లలను కూడా రాజ్‌కుమార్ చంపడం తమను ఆశ్యర్యానికి గురి చేసిందని అన్నారు.

.