జర్నలిస్ట్‌పై ఆర్టీసీ డ్రైవర్ ఓవర్ యాక్షన్ వ్యాలిడ్ పాస్ ఉన్నా బలవంతంగా టికెట్ జారీ…

జర్నలిస్ట్‌పై ఆర్టీసీ డ్రైవర్ దాష్టీకం వ్యాలిడ్ పాస్ ఉన్నా బలవంతంగా టికెట్ జారీ…

డిఎంకి ఫిర్యాదు చేసిన రాజ్ న్యూస్ రిపోర్టర్ సంకోజు మణికంఠ

దేవరకొండ………
చెల్లుబాటు అయ్యే జర్నలిస్ట్ బస్ పాస్ ఉన్నప్పటికీ ఆర్టీసీ సిబ్బంది దౌర్జన్యంగా ప్రవర్తించి టికెట్ ఛార్జీ వసూలు చేసిన సంఘటన దేవరకొండ డిపో పరిధిలో చోటుచేసుకుంది.
బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం… రాజ్ న్యూస్ దేవరకొండ నియోజకవర్గ రిపోర్టర్ సంకోజు మణికంఠ (శుక్రవారం) మాల్ నుండి దేవరకొండకు e డిలక్స్ బస్సులో ప్రయాణించారు. ఈ క్రమంలో తన వద్ద ఉన్న ప్రభుత్వం జారీ చేసిన “డిస్ట్రిక్ట్ జర్నలిస్ట్ పాస్”ను డ్యూటీలో ఉన్న బస్సు డ్రైవర్/సిబ్బందికి చూపించారు. అయితే, జర్నలిస్ట్ ఉచిత పాస్ నియమాలపై తనకు అవగాహన లేదని, 1/3 వంతు టికెట్ తీసుకోవాల్సిందేనని డ్రైవర్ దౌర్జన్యంగా మాట్లాడారు.
జర్నలిస్ట్ ఎంత చెప్పినా వినకుండా బలవంతంగా పాస్ నంబర్ నమోదు చేసి రూ. 50/- టికెట్ ఇష్యూ చేశారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వం అందించిన గుర్తింపు కార్డును తిరస్కరించడమే కాకుండా, ప్రయాణికుడి పట్ల బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన సదరు ఆర్టీసీ సిబ్బందిపై తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని మణికంఠ దేవరకొండ డిపో మేనేజర్ (DM) కి రాతపూర్వక ఫిర్యాదు అందజేశారు.
జర్నలిస్టులకు ప్రభుత్వం కల్పించిన ఉచిత ప్రయాణ హక్కును కాలరాసే విధంగా ప్రవర్తించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆర్టీసీ సిబ్బందికి జర్నలిస్ట్ పాస్సుల నిబంధనలపై అవగాహన కల్పించాలని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు డిమాండ్ చేశారు.