ఘనంగా ముత్యాలమ్మ జాతర వేడుకలు.

*సూర్యాపేట జిల్లా* …. హుజూర్ నగర్ లో ఘనంగా ముత్యాలమ్మ జాతర పండగ వేడుకలు…..

వేకువ జాము నుండే బోనాలతో భారీగా బారులు తీరిన మహిళ భక్తులు……పట్టణంలో ముత్యాలమ్మ (పోచమ్మతల్లి) జాతర కు ఎంతో విశిష్టత ఉంది. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ముత్యాలమ్మ తల్లి విరాజిల్లుతున్నది. భక్తుల కల్పవల్లి అయిన ముత్యాలమ్మకు చీరెలు, సారెలు గాజు లతో ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు కమిటీ వారు….
నైజాం నవాబుల కాలం లో హుజూర్ అనే రాజు ఇక్కడ పరిపాలన చేయడంతో హుజూర్ నగర్ అనే పేరు గడించినట్లు గ్రామ పెద్దలు చెప్తారు. భక్తుల కోరికలు తీర్చే కొంగుబంగారంగా ప్రసిద్ధి గాంచిన అమ్మవారికి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో నిర్వహించే జాతర తెలంగాణాలోనే గుర్తింపు పొందింది. మూడు రోజుల పాటు జరిగే ముత్యాలమ్మ జాతర లో అశేష భక్తజనం అమ్మవార్లను దర్శించుకొని వడపప్పు, బెల్లంఅన్నం ప్రసాదాల బోనాలతో చీరసారె లతో మొక్కులు చెల్లించుకుంటారు.నేటి నుండి ప్రారంభం అయి మూడు రోజులు అంటే ఆదివారం,సోమవారం,గురువారం ఈ జాతర నిర్వహిస్తారు. ముత్యాలమ్మ జాతరలో నిర్వహణ కమిటీ సభ్యులు అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకార్యాలు కలగ కుండా దేవాలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు….
ముత్యాలమ్మ గుడి వద్ద బారిగేట్లు, విద్యుత్ అలంకరణ చేపట్టారు. భక్తుల సౌకార్యం కోసం హుజూర్ నగర్ పోలీసులు బారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. దశాబ్దాలకాలం నుండి హుజూర్నగర్ ముత్యాలమ్మ జాతరను ప్రతియేటా శ్రావణమాసంలో నిర్వహిం చడం అనవాయితిగా వస్తుంది. అందు లో భాగంగానే సెప్టెంబర్ 6న ఆదివారం పెద్ద ముత్యాలమ్మకు, 7న సోమవారం చిన్న ముత్యాలమ్మ జాతర, 10న గురు వారం కనకదుర్గమ్మ తల్లికి మొక్కలు చెల్లిస్తారు. ముత్యాలమ్మ జాతరలో ఎడ్లబండ్లు,ట్రాక్టర్లపై ప్రభలు కట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. పట్టణం లోని నలుమూలల నుండి రైతులు వ్యా పార వర్గాలు ఎండ్లబండ్లు,ట్రాక్టర్లపై ప్రభలు కట్టి జాతరలో పాల్గొని అమ్మవార్ల దేవాలయాల చుట్టూ ప్రదర్శనలు చేపడతారు. ఆడపడుచులు తమపుట్టింటికి వచ్చి అమ్మవార్లకు బోనం చెల్లిస్తారు. తమ కుటుంబాలు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మ వార్లను కొలుస్తారు.