మట్టి వినాయకుల పంపిణీ..
ఇంద్రపాలనగరం: పర్యావరణ పరిరక్షణలో భాగంగా కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఇంద్రపాలనగరం గ్రామ ప్రజలకు ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.
తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం JAC రాష్ట్ర కార్యదర్శి, సర్పంచ్ గర్ధాస్ విక్రమ్, కోరమండల్ మేనేజర్ పి. ప్రసాద్ చేతుల మీదుగా మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మట్టి వినాయకులను ఉపయోగించడం ద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుందని, ప్రతి ఒక్కరూ పర్యావరణహితమైన వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించాలని ఈ సందర్భంగా సూచించారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు వరికుప్పల స్వామి, జూనియర్ అగ్రోనమిస్ట్ సాయిప్రసన్న, ఎండీటీ నరేష్, విజయ్, చేనేత సహకార సంఘం చైర్మన్ రవ్వ నర్సింహా, రాజన్నగారి రమేష్, పగుడాల వేణుగోపాల్, బొల్ల నర్సింహా, కాటేపల్లి మహేష్, జిట్టబోయిన వెంకటేష్, మేకల నరేందర్, పగుడాల నరేందర్, బోనగిరి మధు, గర్ధాస్ సాయి, తవుటం శంకరయ్యతో పాటు రైతులు, చిన్నారులు పాల్గొన్నారు.