రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో స్వర్ణ పతకం సాధించిన దేవరకొండ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని అభిషా..

రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో స్వర్ణ పతకం సాధించిన దేవరకొండ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని అభిషా

​దేవరకొండ…….
నల్గొండ జిల్లా కేంద్రంలో ఇటీవల (అక్టోబర్ 27న) నిర్వహించిన “11th SHOTOKAN TELANGANA STATE KARATE CHAMPIONSHIP” పోటీలలో దేవరకొండ స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని అభిషా విశేష ప్రతిభ కనబరిచింది.
​బ్లాక్ బెల్ట్, అండర్-14 ఇయర్స్ విభాగం కుమితే (Kumite) ఫైటింగ్ పోటీలలో అభిషా అత్యుత్తమ ప్రదర్శనతో ప్రత్యర్థులపై విజయం సాధించి ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ (స్వర్ణ పతకం) కైవసం చేసుకుంది.
​రాష్ట్ర స్థాయిలో పతకం సాధించి పాఠశాలకు, ప్రాంతానికి మంచి పేరు తెచ్చిన అభిషాను సోమవారం పాఠశాల ఆవరణలో ప్రిన్సిపాల్ కలమ్మ , ఉపాధ్యాయ బృందం మరియు పాఠశాల యాజమాన్యం ఘనంగా అభినందించారు.
​ఈ సందర్భంగా పాఠశాల హెచ్‌ఎమ్/ప్రిన్సిపాల్ కలమ్మ మాట్లాడుతూ
“ప్రస్తుత సమాజంలో మహిళలు మరియు బాలికలకు కరాటే వంటి ఆత్మరక్షణ విద్యలు (Self-Defense) ఎంతగానో అవసరం. తమను తాము రక్షించుకోవడానికి, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడానికి ప్రతి ఒక్క బాలిక కరాటే నేర్చుకోవాలి. ప్రతి మహిళా రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయిలా ధైర్యసాహసాలతో తయారవ్వాలి” అని పిలుపునిచ్చారు.
​అలాగే విద్యార్థినికి అత్యుత్తమ శిక్షణ అందించి విజేతగా తీర్చిదిద్దిన కరాటే మాస్టర్స్ స్సేనియర్ మాస్టర్ చిత్తనురు శ్రీనివాస్ ని మాస్టర్ ఆకాష్ ని, వారి కృషిని పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా కొనియాడింది.
​ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.