ఏఐటియుసి జిల్లా మహాసభలను జయప్రదం చేయాలి..త్రిపురం సుధాకర్ రెడ్డి.

ఆగస్టు 1న శనివారం..

సూర్యాపేట జిల్లా..

కేంద్రంలో జరిగే ఏఐటియుసి జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి త్రిపురం సుధాకర్ రెడ్డి కోరారు..

సోమవారం నాడు గరిడేపల్లి మండల కేంద్రంలో జిల్లా మహాసభల కరపత్రాలను విడుదల చేసి మాట్లాడుతూ వివిధ రంగాలలో పనిచేస్తున్న కార్మికులకు లేబర్ కార్డులు ప్రభుత్వం ఇవ్వాలని కోరారు ఎంతోమంది కార్మికులకు ఇప్పటికీ లేబర్ కార్డులు లేవని కార్మికులందరూ లేబర్ కార్డులు పొందాలని ఈ సందర్భంగా తెలిపారు కార్మికులకు అందరికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాలు ఉద్యోగ భద్రత పిఎఫ్ ఈఎస్ఐ మరియు ఇంటి స్థలాలు ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఇవ్వాలని కోరారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలపై జిల్లా వ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ జిల్లా మహాసభలో చర్చించి భవిష్యత్ కార్యక్రమం రూపొందించుకొనుటకు సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరుగు మహాసభకు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు ఎడవెల్లి వెంకటేశ్వర్లు బండ్ల ఆనందరావు బెజ్జం రమేష్ సిమెంట్ బ్రిక్ కార్మికులు తవడబోయిన నవీన్ గండెల శైలజ రెడ్డ బోయిన కోటమ్మ ప్రధాని రమ బెల్లంకొండ రమణ ప్రధాని రాధిక స్వాతి ప్రధాని సైదులు ఈరమ్మ తదితరులు పాల్గొన్నారు