పల్లె పండుగ-3.0 కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
పల్లె పండుగ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ..
• పల్లెల్లో అభివృద్ధి కార్యక్రమాలకు నాందీ పలుకుతున్నాం.
• డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మూడు పల్లె పండుగలు నిర్వహించుకున్నాం.. అన్నీ సక్సెస్ అయ్యాయి.
• ఉద్యమ స్పూర్తితో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామాలను అభివృద్ధి చేస్తున్నారు. ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నా.
• చెప్పిన విధంగానే డబుల్ ఇంజిన్ సర్కార్ రెండేళ్లల్లో అభివృద్ధి చేస్తోంది. జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నాం.
•సంక్షేమం-అభివృద్ధి-సుపరిపాలనతో రాష్ట్రాన్ని నిలబెట్టాం.
• 2024 ఎన్నికల్లో ప్రజలు వేసిన ఓటు వృధా కాలేదు… ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం.
• 2024 ఎన్నికల నాటి కంటే ఎన్డీఏ హవా పెరిగింది.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పల్లె పండుగ 3.0 కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం రామాపురంలో రూ.11,085 కోట్లతో గ్రామీణాభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ నిధుల్లో కేంద్ర వాటా రూ.5,391 కోట్లు కాగా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.5,694 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ సందర్భంగా రామాపురానికి నెల్లూరు, ప్రకాశం, కడప, నంద్యాల జిల్లాల నుంచి లక్షలాది మంది కూటమి నేతలు, కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. దీంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. కాగా, ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, నిమ్మల రామానాయుడు, ఫరూఖ్, బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు.రాబోయే వారం మొత్తం ప్రజల మధ్య గడపబోతున్నందుకు నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. రాష్ట్రవ్యాప్తంగా పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తీరికలేని షెడ్యూల్తో మీ ముందుకు వస్తున్నాను.
నా పర్యటన ఉదయగిరి నుంచి ప్రారంభమవుతుంది. అక్కడ ‘పల్లె పండుగ 3.0’లో భాగంగా గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రూ.11,000 కోట్లను విడుదల చేయబోతున్నాను. ఆ తర్వాత విజయవాడలో 25,000 మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తాను. రేపల్లెలో ఇంటి వద్దకే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, తెనాలిలో 3 లక్షల గ్రామీణ గృహాలను లబ్ధిదారులకు అందిస్తాను. ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించాలన్న మన లక్ష్యంలో భాగంగా జల్ జీవన్ మిషన్ పనుల పురోగతిని కూడా సమీక్షించనున్నాను.
వీటితో పాటు, మదనపల్లెలో రాయలసీమ అభివృద్ధి హబ్ సమావేశం, పాన్ ఐఐటీ డెవలప్మెంట్ మీట్లలో పాల్గొంటాను. ఈ సమావేశాలు మన రాష్ట్ర భవిష్యత్ ప్రగతికి ఎంతో కీలకం కానున్నాయి.
ఉదయగిరి నుంచి విశాఖ వరకు… ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చిత్రపటాన్ని ప్రతి ప్రాంతానికీ విస్తరిస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలు… అన్నీ చెప్పిన ప్రకారం ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తున్నాం. నా ప్రియమైన ప్రజలను కలుసుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఈ అభివృద్ధి యజ్ఞంలో మీరంతా నాతో కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని చంద్రబాబు వివరించారు.