ఛాంపియన్‌గా టీమిండియా… మొహ్సిన్ నఖ్వీపై ట్రోల్స్..!

అందరూ ఊహించినట్టుగానే టీమిండియా జూనియర్ జట్టు నిలిచింది…గ్రూప్ స్టేజ్ లోనే పాకిస్తాన్ చేతిలో చిత్తయిన టీమిండియా, ఫైనల్ లో మాత్రం ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ విధించిన 337 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చివరి బంతి వరకు పోరాడిన టీమిండియా, ఒకే ఒక వికెట్ తేడాతో సూపర్ విక్టరీ అందుకుంది. ఈ తరుణంలోనే మ్యాచ్ గెలిచి 9వ సారి ఛాంపియన్ గా నిలిచింది భారత్. దీంతో టీమిండియా ప్లేయర్లు సంబరాలు చేసుకుంటున్నారు…
అండర్ 19 ఆసియా కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్ లో ( ACC Men’s U19 Asia Cup 2026) భాగంగా ఒమన్ వేదికగా టీమిండియా, పాకిస్తాన్ (Pakistan U19 vs India U19, Final) జట్లు తలపడ్డాయి. అయితే, ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన అండర్ 19 పాకిస్తాన టీమ్, 50 ఓవర్లు ఆడి 9 వికెట్ల నష్టానికి 337 పరుగులు సాధించింది. పాకిస్తాన్ ఓపెనర్ ఉస్మాన్ ఖాన్ 111 బంతుల్లో 107 పరుగులు చేసి ఊచకోత కోశాడు. మూడో స్థానంలో వచ్చిన అబ్దుల్ ఖదీర్ 80 పరుగులు చేయగా, కెప్టెన్ ఫర్హాన్ యూసఫ్ 63 పరుగులతో రాణించాడు.

ఛాంపియన్‌గా టీమిండియా… మొహ్సిన్ నఖ్వీపై ట్రోల్స్

టీమిండియా అండర్ 19 ఛాంపియన్ గా నిలిచిన తరుణంలో మళ్లీ పీసీబీ చైర్మన్ నఖ్వీపై ట్రోల్స్ నడుస్తున్నాయి. భారత్ గెలిచినా, నఖ్వీనే ట్రోఫీ లేపేయడం గ్యారెంటీ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే 2025, 2026 ట్రోఫీలను నఖ్వీ తీసుకెళ్లాడు. ఇప్పుడు అదే పరిస్థితి ఉంటుందని అంటున్నారు. పహల్గామ్ సంఘటన జరిగిన తర్వాత ఇరు జట్ల ప్లేయర్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం లేదు. బీసీసీఐ ఆదేశాల మేరకు నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోలేదు. ఇక ఇప్పుడు లక్ష్య రాజేశ్ కూడా సూర్య, హర్మన్ బాటలోనే నడువనున్నాడు..