స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం వేడుకలు…!

స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం వేడుకలు

దేవరకొండ ……..
దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పండిత్ జవర్లాల్ నెహ్రు 137 వ జయంతి వేడుకలు బాలల దినోత్సవం వేడుకలు
దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ లో బాలల దినోత్సవం జవహర్లాల్ నెహ్రూ 137వ జయంతి సందర్భంగా అధ్యక్షుడు NVT, సభ్యులతో విద్యార్థులతో కలిసి పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించినారు. అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశ మొదటి ప్రధానమంత్రి,
ప్రముఖ న్యాయవాది అని. నెహ్రూకి పిల్లలంటే ఎంతో ఇష్టం. పిల్లలు ఆయన్ను ప్రేమగా “చాచా నెహ్రూ” అని పిలుచుకునేవారు అని,
పిల్లల సంక్షేమం, విద్య మరియు వారి హక్కుల గురించి ఆయన ఎంతో ఆలోచించేవారు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీధర్ గౌడ్, కోశాధికారి కృష్ణ కిషోర్, బత్తుల అమర్, రాపోలు నిరంజన్, తాళ్ల సురేష్, శ్రీనయ్య, కరాటే మాస్టర్ గోపి, మహేందర్ ,ఆదిత్య, శివానంద్, శ్రీరామ్, సహర్షా రెడ్డి రాజేందర్ క్రీడాకారులు కళాకారులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.