బాలల దినోత్సవం జడ్పిహెచ్ఎస్ చందంపేట పాఠశాల..!

బాలల దినోత్సవం జడ్పిహెచ్ఎస్ చందంపేట పాఠశాల

చందంపేట………
బాలల దినోత్సవం సందర్భముగా జడ్పిహెచ్ఎస్ చందంపేట పాఠశాలలో నిర్వహించిన ముగింపు కార్యక్రమములో జిహెచ్ఎం పి లీలారాణి మాట్లాడుతూ ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు భారత తొలి ప్రధాని స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భముగా బాలల దినోత్సవాన్ని జరుపుకుంటామని బాలలంటే చాచా నెహ్రూ కి చాలా ఇష్టమని అదే విధముగా పంచశీలను మరియు పంచవర్ష ప్రణాళికలను ప్రవేశపెట్టి భారత అభివృద్ధి ప్రదాతగా నిలిచారని అభివర్ణించారు. విద్యార్థులకు వివిధ పోటీలను నిర్వహించి బహుమతి ప్రధానం చేసి, మిఠాయిలను పంచడం జరిగింది. విద్యార్థులు తమ నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.
ఈ కార్యక్రమములో ఎం చంద్రశేఖర్, గోవిందు కొండయ్య, జోసెఫ్ చౌదరి, రామచంద్రు, విజయ, ఎల్ మధు, డాక్టర్ వెంకట్, సంధ్యారాణి మొదలగు వారు పాల్గొని కార్యక్రమమును విజయవంతం చేసినారు.