అయోధ్య రామయ్య ఆలయానికి భారీ ఆదాయం
అయోధ్య బాల రామయ్య ఆలయానికి భారీగా ఆదాయం సమకూరుతోంది.
వార్షిక ఆదాయం పరంగా దేశంలోనే మూడో పెద్ద ఆలయంగా రికార్డు సాధించింది.
రామ్లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించిన నాటి నుంచి 13 కోట్ల మందికిపైగా భక్తులు, పర్యాటకులు ఈ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ ఆలయ వార్షిక ఆదాయం రూ.700కోట్లు దాటింది. వార్షిక ఆదాయం పరంగా రామ మందిరం స్వర్ణ దేవాలయం, శ్రీమాతా వైష్ణోదేవి, షిర్డీసాయిబాబా ఆలయాలను వెనక్కి నెట్టింది.