రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో స్వర్ణ పతకం సాధించిన దేవరకొండ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని అభిషా
దేవరకొండ…….
నల్గొండ జిల్లా కేంద్రంలో ఇటీవల (అక్టోబర్ 27న) నిర్వహించిన “11th SHOTOKAN TELANGANA STATE KARATE CHAMPIONSHIP” పోటీలలో దేవరకొండ స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని అభిషా విశేష ప్రతిభ కనబరిచింది.
బ్లాక్ బెల్ట్, అండర్-14 ఇయర్స్ విభాగం కుమితే (Kumite) ఫైటింగ్ పోటీలలో అభిషా అత్యుత్తమ ప్రదర్శనతో ప్రత్యర్థులపై విజయం సాధించి ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ (స్వర్ణ పతకం) కైవసం చేసుకుంది.
రాష్ట్ర స్థాయిలో పతకం సాధించి పాఠశాలకు, ప్రాంతానికి మంచి పేరు తెచ్చిన అభిషాను సోమవారం పాఠశాల ఆవరణలో ప్రిన్సిపాల్ కలమ్మ , ఉపాధ్యాయ బృందం మరియు పాఠశాల యాజమాన్యం ఘనంగా అభినందించారు.
ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎమ్/ప్రిన్సిపాల్ కలమ్మ మాట్లాడుతూ
“ప్రస్తుత సమాజంలో మహిళలు మరియు బాలికలకు కరాటే వంటి ఆత్మరక్షణ విద్యలు (Self-Defense) ఎంతగానో అవసరం. తమను తాము రక్షించుకోవడానికి, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడానికి ప్రతి ఒక్క బాలిక కరాటే నేర్చుకోవాలి. ప్రతి మహిళా రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయిలా ధైర్యసాహసాలతో తయారవ్వాలి” అని పిలుపునిచ్చారు.
అలాగే విద్యార్థినికి అత్యుత్తమ శిక్షణ అందించి విజేతగా తీర్చిదిద్దిన కరాటే మాస్టర్స్ స్సేనియర్ మాస్టర్ చిత్తనురు శ్రీనివాస్ ని మాస్టర్ ఆకాష్ ని, వారి కృషిని పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా కొనియాడింది.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.