దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యాటక దినోత్సవం,,,..।

దేవరకొండ ………
దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేవరకొండ ఖిల్లా వద్దా విద్యార్థులకు పర్యాటక దినోత్సవం గురించి వివరించి, దేవరకొండ ఖిల్లా ఘనత గురించి వివరించినారు. ఈ సందర్భంగా అధ్యక్షులు NVT మాట్లాడుతూ పర్యాటకం యొక్క ప్రాముఖ్యతను, దాని సామాజిక, సాంస్కృతిక, రాజకీయ మరియు ఆర్థిక విలువలను అంతర్జాతీయ సమాజానికి తెలియజేయడం.ప్రముఖ్యతపర్యాటక రంగం ద్వారా గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ (SDGs) సాధించడం.పర్యావరణ పరిరక్షణ, ఉపాధి అవకాశాలు మరియు స్థానిక ఆర్థిక వ్యవస్థలను పెంపొందించడం.డిజిటల్ టెక్నాలజీ మరియు కృత్రిమ మేధ (AI) సాయంతో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయడం అని అన్నారు. దేవరకొండ ఖిల్లా గురించి మాట్లాడుతూ తెలంగాణలోని నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో ఏడు కొండల మధ్య చారిత్రక వైభవంతో విరాజిల్లుతున్న ఒక ప్రసిద్ధ గిరి దుర్గమే దేవరకొండ ఖిల్లా (కోట)అని,కోటను 14వ శతాబ్దంలో రేచెర్ల పద్మనాయక వెలమ రాజులు నిర్మించారనీ, ఇది 1287 నుండి 1482 వరకు వెలమ రాజుల పరిపాలనలో కీలక కేంద్రంగా ఉండేదనీ, ప్రసిద్ధుడైన మాడ నాయుడు పాలనలో ఈ కోట మరింత అభివృద్ధి చెందిందనీ, శత్రువులకు దుర్భేద్యంగా ఉండేలా సుమారు ఏడు కొండలను కలుపుతూ సువిశాలమైన రక్షణ గోడలతో దీనిని నిర్మించారనీ, ఈ కోట ముఖద్వారంలో చెక్కబడిన “పూర్ణకుంభం” (కలశం) ఈ ప్రాంతపు చారిత్రక ప్రతీకగా నిలుస్తుందనీ, ఖిల్లా పరిసరాల్లో అప్పట్లో నిర్మించిన రామాలయం, ఆంజనేయస్వామి మరియు శివాలయాలు ఇప్పటికీ చెక్కుచెదరకండా ఉన్నాయనీ, ఇక్కడి రాతి శిల్పకళా చాతుర్యం ఎంతో ఆకట్టుకుంటుందనీ, చుట్టూ కొండలు, అడవులు, ప్రకృతి అందాలతో ఈ కోట ట్రిక్కింగ్ (Treking) చేయడానికి మరియు చరిత్రను తెలుసుకోవడానికి అనువైన ప్రదేశం అని అన్నారు. దేవరకొండ కిల్లాను పర్యాటక స్థలంగా తీర్చిదిద్దాలని ప్రజా ప్రతినిధులు అధికారులు పట్టించుకోవాలని సందర్భంగా వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీధర్ గౌడ్, కోశాధికారి కృష్ణ కిషోర్, AISF జిల్లా అధ్యక్షులు వలమల్ల ఆంజనేయులు, కరాటే మాస్టర్ గోపి, అభిరామ్, నిరంజన్, వెంకటేష్, ప్రవీణ్, మల్లేష్, త్రినేత్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.