ఢిల్లీలో అత్యంత ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం.

ఢిల్లీలో అత్యంత ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం.

ఢిల్లీలో సగటున 348 AQI పాయింట్లు నమోదు.

వెరీపూర్ కేటగిరీలో ఢిల్లీ గాలి నాణ్యత.

48 కేంద్రాల్లో 300పాయింట్లు దాటిన వాయునాణ్యత
NIH నరేలా దగ్గర అత్యధికంగా 429 పాయింట్లు నమోదు
కాలుష్యంతో కళ్ల మంటలు, దగ్గు, శ్వాస సమస్యలు
ఢిల్లీ NCRలో GRAP-1, 2, 3 ఆంక్షలు అమలు
బొగ్గు, కట్టెల వినియోగం, డీజిల్ జనరేటర్లపై నిషేధం
CNG, ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య పెంపు
ఐదో తరగతి వరకు విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు
కార్యాలయాల్లో 50 శాతం సిబ్బందితో విధులు
అత్యవసరం కాని నిర్మాణ పనులపై నిషేధం కొనసాగింపు…

వాయు నాణ్యత ‘ప్రమాదకర స్థాయి’లో ఉన్నట్టు నమోదయింది. పొగ, మంచు కారణంగా ‘దృగ్గోచరత’ కూడా తగ్గి ఎదురుగా వస్తున్న వాహనాలు కూడా సక్రమంగా కనిపించడం లేదు. ఇంతవరకు పాకిస్థాన్‌లోని లాహోర్‌ ఈ స్థానంలో ఉండగా, దాన్ని ఢిల్లీ అధిగమించింది. వాయు నాణ్యత సూచీ (ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌-ఏక్యూఐ) 50 ఉంటే దానిని మంచి వాతావరణంగా, ఆరోగ్యానికి హాని కలిగించని పరిస్థితిగా పరిగణిస్తారు. స్విట్జర్లాండ్‌కు చెందిన ఐక్యూ ఎయిర్‌ సంస్థ లెక్కల ప్ర కారం ఢిల్లీలో ఏక్యూఐ 334గా నమోదయింది. గాలిలోని విషపూరిత పదార్థాల ఆధారంగా దీనిని గణించింది. గాలి నాణ్యత ‘ప్రమాదకర స్థాయి’లో ఉందని, ఆ కారణంగానే ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా నమోదయిందని పేర్కొంది. ప్రభుత్వ సంస్థ అయిన కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మాత్రం ఏక్యూఐ 403గా నమోదయిందని, దీనిని ‘తీవ్రమైన స్థాయి’గా పరిగణించాల్సి ఉంటుందని తెలిపింది. కాలుష్యాన్ని లెక్కించే విధానంలో తేడాలు ఉండడంతో భారత లెక్కల ప్రకారం ఏక్యూఐ పాయింట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ కాలుష్య తీవ్రత స్థాయి మాత్రం తక్కువగా నమోదయింది.