– పెన్షన్ లబ్దిదారులకు మంజూరు పత్రాల పంపిణీ
– వృద్ధాప్య పింఛన్లు త్వరగా మంజూరు చేయాలి.. ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి
– తీదేడు గ్రామ సర్పంచ్
అర్హులైన లబ్ధిదారులకు వృద్ధాప్య పింఛన్లు త్వరగా మంజూరు చేయాలని తీదేడు గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి అన్నారు.
చింతపల్లి ………
చింతపల్లి మండల కేంద్రంలోని సాయి సుమంగళి గార్డెన్స్‌లో చేయూత పించన్లు మంజూరైన లబ్దిదారులకు మంజూరు పత్రాలను అందించే కార్యక్రమం నిర్వహించారు.
ఇట్టి కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ తీదేడు గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి చేతుల మీదుగా నూతనంగా మంజూరైన వివిధ రకాల పెన్షన్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. ముఖ్యంగా వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులకు పెన్షన్లు ఎంతో ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయని పేర్కొన్నారు.
గ్రామంలో అర్హత కలిగి ఉండి ఇంకా వృద్ధాప్య పింఛన్లు మంజూరు కాని వృద్ధులకు ప్రభుత్వం వెంటనే పింఛన్లు మంజూరు చేయాలని కోరారు. వృద్ధాప్యంలో ఉన్న నిరుపేదలకు పింఛన్లు ఎంతో అవసరమని, ఆలస్యం చేయకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందేలా అధికారులు, ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి కిరణ్ కుమార్, వార్డు సభ్యులు,మాజీ ప్రజాప్రతినిధులు,గ్రామస్తులు,ఆసారా పెన్షన్ల లబ్దిదారులు, తదితరులు పాల్గొన్నారు.