అర్ధరాత్రి స్ట్రాంగ్ రూమ్ వద్దకు మమతా బెనర్జి..

అర్ధరాత్రి స్ట్రాంగ్ రూమ్ వద్దకు మమతా బెనర్జి.

* బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సౌత్ కోల్కతాలోని షెకావత్ మెమోరియల్ స్కూల్ వద్ద ఉన్న స్ట్రాంగ్ రూమ్ దగ్గరకు వెళ్లారు.

* చాలా చోట్ల అవకతవకలు జరిగినట్లు తెలిసిందని, అందుకే ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు.

* కేంద్ర బలగాలు నన్ను అడ్డుకున్నాయి. కానీ ఎన్నికల నిబంధనల ప్రకారం అభ్యర్థులు సీల్ చేసిన రూమ్ బయటి వరకు వెళ్లొచ్చని చెప్పడంతో అనుమతించారు.

* ఈవీఎంలలో ఏవైనా అవకతవకలు జరిగితే పోరాడతాం అని ఆమె పేర్కొన్నారు..

విడుదలకు ముందు కోల్‌కతా (Kolkata)లో తీవ్ర రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతోందన్న ఆరోపణ నేపథ్యంలో గురువారం రాత్రి సీఎం మమతా బెనర్జీ (CM Mamata Banerjee) స్వయంగా రంగంలోకి దిగి స్ట్రాంగ్‌రూమ్ వద్ద నిరసన చేపట్టారు. భవానీపూర్ నియోజకవర్గ ఈవీఎంలను భద్రపరిచిన శాఖావత్ మెమోరియల్ స్కూల్ స్ట్రాంగ్‌రూమ్ వద్ద మమతా బెనర్జీ సుమారు 4 గంటల పాటు గడిపారు. గురువారం రాత్రి ఆలస్యంగా అక్కడికి చేరుకున్న ఆమె, అభ్యర్థి హోదాలో లోపలికి వెళ్లి అర్థరాత్రి 12:07 గంటల వరకు అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించారు.