జింబాబ్వే తో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా ఘనంగా ప్రారంభించింది. శుక్రవారం వడోదర వేదికగా జరిగిన తొలి వన్డేలో సమష్టిగా రాణించిన భారత్ 9 వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది…ఓపెనర్ ప్రతీకా రావల్(96 బంతుల్లో 15 ఫోర్లతో 100 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగడంతో 137 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 49.5 ఓవర్లలో 197 పరుగులకు ఆలౌటైంది. తెలుగు తేజం శ్రీచరణి(4/23) నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. క్రాంతి గౌడ్(3/42) మూడు వికెట్లు పడగొట్టింది. దీప్తి శర్మ(2/44)కు రెండు వికెట్లు దక్కగా.. షెఫాలీ వర్మ ఒక వికెట్ తీసింది.
అనంతరం భారత్ 27.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 200 పరుగులు చేసి సునాయస విజయాన్ని అందుకుంది. ప్రతీకా రావల్ అజేయ శతకానికి తోడుగా షేఫాలీ వర్మ(33 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 64 నాటౌట్) విధ్వంసకర అర్ధశతకంతో చెలరేగింది. స్మృతి మంధాన(34 బంతుల్లో 4 ఫోర్లతో 32 నాటౌట్) పర్వాలేదనిపించింది. జింబాబ్వే బౌలర్లలో ఒలిండర్ చారే ఏకైక వికెట్ తీసింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది.