సోనియా గాంధీ రాసిన Belonging: A Journey of Love అనే జ్ఞాపకాల పుస్తకావిష్కరణ సోమవారం న్యూఢిల్లీలో జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వివాదానికి కారణమయ్యాయి..
ఈ సదస్సులో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఎన్నికల జాబితా సవరణ ప్రచారాన్ని, రాహుల్ గాంధీని ఆ ఇటలీ నేత ప్రశంసించగా.. అక్కడ రాహుల్ గాంధీ నవ్వుతూ చప్పట్లు కొట్టడంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశ అంతర్గత విషయాల్లో విదేశీయుల జోక్యాన్ని అనుమతించడంపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా, శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ మాత్రం దీనిని సమర్థించారు..
రాహుల్ తన తల్లిదండ్రులు రాజీవ్ గాంధీ, సోనియాగాంధీల మధ్య అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ‘ప్రతి భోజన సమయంలో నాన్న ఉండేవారు. నాన్న ఒడిలో అమ్మ కూర్చునేవారు. ఇదంతా నాకు చాలా సాధారణమైన విషయంగా అనిపించేది’ అని రాహుల్ చెప్పారు. ఈ అలవాటు తనకు సహజంగా అనిపించేదని, ఒకసారి తన స్నేహితుడి తల్లి కూడా అతడి నాన్న ఒడిలో ఎందుకు కూర్చోవడం లేదని అడిగినట్లు గుర్తు చేసుకున్నారు.
https://x.com/i/status/2122626811637215676
రాహుల్ గాంధీపై బీజేపీ విమర్శలు..
రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు అనిర్బన్ గంగూలీ ఈ వ్యాఖ్యలపై స్పందించారు. ”సాధారణ ముసుగులో కనిపిస్తున్న సిగ్గులేని ప్రవర్తన” అని విమర్శించారు. దేశ ప్రజలకు చెప్పే నిద్రకథలా ప్రతీ భోజన సమయంలో తన తల్లి తండ్రి ఒడిలో కూర్చునేవారని రాహుల్ ఎందుకు చెప్పాల్సి వచ్చిందని ప్రశ్నించారు. 55 ఏళ్లకి వ్యక్తి డిన్నర్ టేబుల్‌కు, బహిరంగ వేదికకు మధ్య తేడా తెలియకపోతే, ఒక వేళ ప్రధాని అయినట్లు ఊహించుకుంటే, ప్రధాని కార్యాలయంలోని రహస్య ఫైళ్లను ఏం చేస్తారు? సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. కొంతమంది నెటిజన్లు ఇది భారత సంస్కృతికి భిన్నంగా ఉందని అభిప్రాయపడ్డారు. పిల్లల సమక్షంలో తల్లి తండ్రి ఒడిలో కూర్చునే సంస్కృతి భారత్‌లో లేదని కామెంట్ చేస్తున్నారు…
విదేశీ నేత వ్యాఖ్యలపై కిరణ్ రిజిజు ఆగ్రహం భారత దేశాన్ని ఒక విదేశీయుడు అవమానిస్తుంటే ఎవరైనా నవ్వుతారా అని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రశ్నించారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ.. విదేశీయుల చేతిలో దేశం అవమానానికి గురవుతున్నప్పుడు ఎవరైనా ఇలాగే నవ్వుతూ ఆనందిస్తారా అని ఎద్దేవా చేశారు.