కార్పొరేట్ ఆసుపత్రులపై ఫైరింగ్ అయిన రాములమ్మ.!.శాసనమండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి స్వయాన వైద్య శాఖ మంత్రి దామోదర్ రెడ్డి కు ఫిర్యాదు..
నల్గొండ
నీలగిరిలో.
ఈరోజు శాసనమండలి లో కార్పొరేట్ ఆసుపత్రులపై ఫైరింగ్ అయిన రాములమ్మ.!(విజయ్ శాంతి).
శాసనమండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి స్వయాన వైద్య శాఖ మంత్రి దామోదర్ రెడ్డి కు ఫిర్యాదు..
కానీ గత కొన్ని రోజుల క్రితం నల్గొండ జిల్లా
డి ఎం హెచ్ ఓ పనికట్టుకొని ప్రైవేట్ ఆస్పత్రులపై తమకు అనుకూలంగా ఉన్న కార్పొరేట్ ఆసుపత్రులపై పైపై చెకింగ్ లు చేసి చేతులు దులుపుకున్నరని గుసగుసలు ప్రజల్లో వినిపిస్తున్నాయి…
ఒక విధంగా చూడాలంటే రాజకీయ పలుకుబడి ఉన్న ఆస్పత్రులు వదిలి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేని హాస్పిటల్ల పై కఠిన దాడులు చేసి టార్గెట్ చేశారా అనే విధంగా ప్రజల్లో గుసగుసలు…
ENO తో నయమయ్యే ఆరోగ్య సమస్యను సర్జరీ చేయాల్సిందేనని రాంగ్ రిపోర్ట్ సృష్టించి 12 లక్షలు ఖర్చు చేసుకొనేదే ఐదు గంటల్లో మరణం తద్యమని జోస్యం చెప్పి భయభ్రాంతులకు గురిచేసిన నల్లగొండ రామగిరి లో ఉన్న ప్రముఖ ఆసుపత్రి *రివర్ నీమ్స్* ఆసుపత్రి పై డీఎంహెచ్ఓ కన్ను ఎందుకు పడటం లేదని ప్రజల సందేహం…
నిరుపేద ప్రజలు ఆ కార్పొరేట్ హాస్పిటల్ ను నమ్మి చికిత్స కోసం వెళ్లి ఆస్తులు అమ్ముకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి…
*శాసనమండలి సాక్షిగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్వయాన చెప్పిన వాస్తవాలు 100% నిజం.!*
కార్పొరేట్ ఆసుపత్రులు ఇంత నీచానికి దిగజారటం ఏంటి.?
దీని వెనక రాజకీయ బలం ఉన్నందునే కొన్ని ఆసుపత్రులపై పైపైనే నామమాత్రపు చెకింగ్లు చేసి మౌనం వహించడం ఏంటని నల్లగొండ ప్రజానికం ప్రశ్నిస్తుంది..?
CT వీడియో సిటీ స్కాన్ లో అంతా నార్మల్ గా ఉన్న ఏదో పెద్ద సమస్య ఉందని రాంగ్ రిపోర్ట్ ఇచ్చి హైదరాబాద్ లో తమకు అనుకూలంగా ఉన్న ఆస్పత్రికి పంపించడం వెనుక ఆంతర్యం ఏంటి..?
నిరుపేద ప్రజల్ని జెలగల్ల పట్టిపీడుస్తూ పేదల ఆస్తులని అమ్మేలా చేసి తమ ఆస్తులను పెంచుకుంటున్న కార్పొరేట్ ఆసుపత్రిలపై ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తున్నది..?
కొందరు డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రిలో జీతం తీసుకుంటూ కార్పొరేట్ ఆసుపత్రులు నిర్మించుకొని ప్రభుత్వాసుపత్రిలో వచ్చే పేషెంట్ ని తమ ఆసుపత్రులలో చేరదీసి వైద్యం చేసి సొమ్ములు చేసుకుంటున్నారు…
దీనిపై D.M.H.O ఎందుకు మౌనం..?
ఉదాహరణకు రామగిరి లోని నిమ్స్ రివర్ ఆసుపత్రి ఇంచార్జీ కు ENO వార్తా పంపించగా…
రాంగ్ ఇన్ఫర్మేషన్ మీరు రాసిన వార్త అంటూ.. 70వేలు ఒక గంటకి తీసుకోలేదు.. 24 గంటలకు 54 వేలు మాత్రమే వేశామని వివరణ ఇవ్వడం కోస మెరుపు..
వార్త ఫేక్ అని కొట్టిపారేయడం నన్ను చాలా బాగా కలిసి వేసింది…
బాధితుడు తను ఐదు గంటల్లో మరణిస్తున్నాను అని వార్త వినగానే ఆస్తి ఉంటే ఏమి లాభం ప్రాణం లేనప్పుడు అనుకొని తమ వారసత్వంగా వచ్చే భూమిని 30 లక్షలకు మార్కెట్లో డిమాండ్ ఉండగా తన పరిస్థితి దుష్య 12 లక్షల కే అమ్మివేసి తన ఆరోగ్యం మెరుగుపరచుకోవడానికి పట్టణం బాట పట్టాడు…
తమ కుటుంబ సభ్యుల్లో ఒకరు అపోలో హైదరాబాద్ ఆస్పత్రిలో ఉన్న విషయం తెలుసుకొని *నల్లగొండ నిమ్స్ రివర్ హాస్పిటల్* వాళ్ళు రిఫర్ చేసిన ఆసుపత్రికి వెళ్లకుండా *అపోలో* ఆసుపత్రికి వెళ్ళగా అక్కడి ప్రముఖ డాక్టర్ నిమ్స్ రివర్ హాస్పిటల్ వారి ఫేక్ రిపోర్ట్ డొల్లతనాన్ని కుండ బద్దలు కొట్టినట్టు నిజాన్ని చెప్పాడు…
అది కూడా పేషెంట్ డిశ్చార్జ్ సమ్మరీ లో కూడా మెన్షన్ చేశాడు…
ఒకవేళ నిమ్స్ రివర్ నల్లగొండ వాళ్లు తాము చెప్పిన హాస్పిటల్ కి వెళ్లి ఉంటే అవసరం లేకున్నా సర్జరీ చేసి డబ్బులు దోపిడీ చేసి ఉండేవారని బాధితుడు ఆందోళన వ్యక్తపరుస్తున్నాడు..
రేపు డిఎంహెచ్ఓ కార్యాలయానికి నేరుగా కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని ఫిర్యాదు చేస్తామని వెల్లడించాడు…
ఇప్పుడు ఆ పేషంట్ పరిస్థితి నిలకడగా ఉంది.. ఐదు గంటల్లో చనిపోతానని హెచ్చరించిన వైద్యులకు చెప్పుదెబ్బ లాంటి సంఘటన రేపు జరగబోతుందని అనుకోవచ్చు చనిపోతాను అనుకున్నా వ్యక్తి నేరుగా డిఎంహెచ్ఓ కు కలిసి ఫిర్యాదు చేయనున్నాడు…
దీన్నిబట్టి నల్లగొండ జిల్లాలో కార్పొరేట్ ఆసుపత్రులు ఏ విధంగా దోపిడీకి గురి అయితు నిరుపేదల ఆస్తులను కొల్లగొడుతూ తమ ఆస్తులను పెంచుకుంటున్నారు అర్థమవుతుంది…