వీధి కుక్క బీభత్సం.. మహిళపై దాడి
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళపై వెనుక నుంచి వచ్చిన వీధి కుక్క అకస్మాత్తుగా దాడి చేసింది.
మహిళ తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, కుక్క వదలకుండా నాలుగు చోట్ల కరిచింది.
చివరకు మహిళ రాయి తీసుకుని కొట్టేందుకు ప్రయత్నించడంతో కుక్క అక్కడి నుంచి పారిపోయింది.
దాడిలో గాయపడిన మహిళను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
వీధి కుక్కల నియంత్రణకు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.