కొండమల్లేపల్లి………
కొండమల్లేపల్లి పట్టణంలో విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం సమావేశం జిల్లా ఉపాధ్యక్షులు సోనగంటి గోవర్ధనాచారి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు చొల్లేటి రమేష్ చారి గారు, జిల్లా ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ సంఘాన్నిమరింత బలోపేతం చేయాలని, విశ్వకర్మల కోసం విశ్వకర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, 50 సంవత్సరాల వయస్సు నుంచే పెన్షన్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అలాగే ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో విశ్వబ్రాహ్మణ సోదరులందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి సంఘాన్ని మరింత బలోపేతం చేస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు శ్రీనివాస చారి, జంగా చారి, అధ్యక్షులు నరేంద్రచారి, ప్రధాన కార్యదర్శి మల్లేష్ చారి, పరమేష్ చారి, అంజి చారి, సైదా చారి, వెంకటేశ్వర చారి, కోట చారి, నర్సింహ చారి తదితరులు పాల్గొన్నారు.