బాపట్ల పట్టణం:-
యార్డ్ లు దగ్గర జగనన్న కాలనీలో అంధకారం.వీధిలైట్లు లేక రాత్రివేళ ప్రజల అవస్థలు…!
బాపట్ల పట్టణంలోని జగనన్న కాలనీలో వీధిలైట్లు వెలగకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో రాత్రివేళ పిల్లలు బయటకు రావాలన్నా, ప్రజలు ఎట్టు వేళ్ళని పరిస్థితి గా ఉంది అని భయపడుతున్నారు. పిల్లలు చీకట్లో నడవాలి అంటే నే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు…ఇప్పటికైనా సంబంధిత మున్సిపాలిటీ అధికారులు స్పందించి వెంటనే వీధిలైట్లు వెలిగేలా చర్యలు తీసుకోవాలని, రోడ్లపై నిలిచిన వర్షపు నీటిని తొలగించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కాలనీ వాసులు కోరుతున్నారు.