డ్రోన్ల నిఘాలో ప్రశాంతంగా ముగిసిన నీట్ పీజీ పరీక్షలు
మదనపల్లె.
అన్నమయ్య జిల్లాలో నీట్ పీజీ పరీక్షలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా ముగిశాయి.
నాలుగు పరీక్షా కేంద్రాల్లో డ్రోన్ల నిఘాతో పాటు కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
మొత్తం 747 మంది విద్యార్థులు గాను 717 మంది పరీక్షకు హాజరుకాగా, 30 మంది గైర్హాజరయ్యారు.
రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్, మదనపల్లె డీఎస్పీ బుచ్చిరాజు పర్యవేక్షణలో భద్రతా చర్యలు చేపట్టారు.
డ్రోన్ల నిఘా, కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు నడుమ అన్నమయ్య జిల్లాలో “నీట్ పీజీ పరీక్షలు” ప్రశాంతంగా ముగిశాయి. రాయచోటి డిఎస్పీ కృష్ణమోహన్, మదనపల్లె, డీఎస్పీ బుచ్చిరాజు, పర్యవేక్షణలో జిల్లాలోని నాలుగు ఇంజనీరింగ్ కళాశాల (బిట్స్, శ్రీ సాయి, మిట్స్, ఆదిత్య) కేంద్రాలలో పరీక్షలు పకడ్బందీగా నిర్వహించారు.
జిల్లా వ్యాప్తంగా ఈ పరీక్షలకు మొత్తం 747 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 717 మంది పరీక్ష రాశారు. 30 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు స్పష్టం చేశారు. పోలీసు శాఖ ముందస్తు జాగ్రత్తలు, పకడ్బందీ ఏర్పాట్ల నడుమ పరీక్షలు సజావుగా ముగియడంతో అధికారులతో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.దివారం నిర్వహించిన నీట్–పీజీ 2026 పరీక్ష జిల్లాలో ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది. జిల్లాలోని నాలుగు పరీక్షా కేంద్రాల వద్ద ఇద్దరు డీఎస్పీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.
ఎచ్చెర్ల మండలం చిలకపాలెం జంక్షన్లోని శివాని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, బి.ఆర్. అంబేడ్కర్ యూనివర్సిటీ సమీపంలోని వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, నరసన్నపేట మారుతీనగర్–2లోని కోర్ టెక్నాలజీస్, టెక్కలిలోని ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజ్ వద్ద ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులను నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు.