ఓటర్ల జాబితా సవరణను పారదర్శకంగా చేపట్టాలి బిఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ.
ఓటర్ల జాబితా సవరణను పారదర్శకంగా చేపట్టాలి
బిఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ
దేవరకొండ……..
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై దేవరకొండ సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారుల సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన పలు అంశాలపై అధికారులు చర్చించారు.
ఈ సందర్భంగా బిఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ మాట్లాడుతూ.. SIR ప్రక్రియలో భాగంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఓటర్ల జాబితాలో ఉన్న తప్పులు, అభ్యంతరాలు, మార్పులు, చేర్పులను నిబంధనల ప్రకారం పరిశీలించి పరిష్కరించాలని సూచించారు.అర్హులైన ఏ ఒక్కరి ఓటు హక్కు కోల్పోకుండా, అనర్హుల పేర్లు జాబితాలో లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. SIR ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలు, సూచనలను స్వీకరించి నిష్పక్షపాతంగా పరిష్కరించాలని కోరారు.సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేసి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, సమర్థవంతంగా పూర్తి చేయాలని బొడ్డుపల్లి కృష్ణ కోరారు.