గాంధీనగర్ లో భక్తి పారవశ్యంలో 9వ వార్షికోత్సవ వేడుకలు…

దేవరకొండలో అతిపెద్ద గణనాథుడికి ఘనంగా హోమం, పూజలు..

గాంధీనగర్ లో భక్తి పారవశ్యంలో 9వ వార్షికోత్సవ వేడుకలు..

దేవరకొండ ……..
దేవరకొండ పట్టణంలోని గాంధీనగర్ లో కొలువుదీరిన లంబోదర గణపయ్య ఆలయంలో హోమం మరియు ప్రత్యేక పూజలు అత్యంత వైభవంగా జరిగాయి.
దేవరకొండలోనే అతిపెద్ద గణపతిగా పేరుగాంచిన గాంధీనగర్ గణనాథుడు తొమ్మిదేళ్లుగా భక్తులకు దర్శనమిస్తున్నాడు.
ఈ ఏడాది ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహిస్తున్నారు.
గత 4 సంవత్సరాలుగా ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గంజి సాయి కుమార్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ ఏడాది కూడా భక్తులకు స్వామివారు దివ్య దర్శనమిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు.
ఈ ఉత్సవ కమిటీలో అధ్యక్షుడిగా గంజి సాయి కుమార్, ప్రధాన కార్యదర్శిగా షఫీ, కోశాధికారిగా గంజి వంశీ వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాడెం రాములు అడ్వకేట్ , గంజి రాజలింగం ,తన్నీరు చంటి, కాసుల వంశీ, అంబటి మహేష్, ఏలా అరుణ్, వడ్త్య రాజు, హరీష్, బొడ్డుపల్లి, మడెం మంజునాథ్, ఆదిత్య గోగికర్, ఆకాష్ గోగికర్, రిషికేష్ తదితరులు పాల్గొన్నారు.