గ్రాడ్యుయేట్లు ప్రతి ఒక్కరూ ఎమ్మెల్సీ ఓటు హక్కు నమోదు చేసుకోవాలి..మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్.
దేవరకొండ……….
గ్రాడ్యుయేట్లు ప్రతి ఒక్కరూ ఎమ్మెల్సీ ఓటు హక్కు నమోదు చేసుకోవాలి
-అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు ఎట్లుంది.
-ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్ పోరాటపటిమ ఎట్లా కొనసాగుతుంది.
-ప్రతి పట్టభద్రుడు ఈ విషయాన్ని గమనించి నిర్ణయం తీసుకోవాలి.
-గతంలో ఉన్న గ్రాడ్యుయేట్ ఓటర్ లిస్టు పూర్తిగా రద్దయింది.
-పాత, కొత్త ప్రతి ఓటరు తప్పనిసరిగా తమ ఓటు నమోదు చేసుకోవాలి.
-రాష్ట్రంలో జరుగుతున్న రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ప్రతి ఓటరు తమ హక్కును సద్వినియోగం చేసుకోవాలి.
-విశ్రాంత ఉద్యోగులు, ప్రస్తుత ఉద్యోగులు, నిరుద్యోగ యువత, వ్యాపారులు ఇలా పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ ఓటును నమోదు చేసుకోవాలి
–దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్
పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ తమ ఎమ్మెల్సీ ఓటు హక్కును తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పిలుపునిచ్చారు.సోమవారం దేవరకొండ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు హక్కును దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ నమోదు చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ……గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ప్రతి పట్టభద్రుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. గతంలో ఉన్న గ్రాడ్యుయేట్ ఓటరు జాబితా రద్దైన నేపథ్యంలో పాత ఓటర్లు, కొత్తగా అర్హత పొందిన పట్టభద్రులు అందరూ తప్పనిసరిగా మళ్లీ తమ పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపారు.ప్రస్తుత అధికార కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు, ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ కొనసాగిస్తున్న ప్రజా పోరాటాలను పట్టభద్రులు గమనించాలని రవీంద్ర కుమార్ అన్నారు. ప్రజా సమస్యలపై రాజకీయ పార్టీల వైఖరి, వారి పనితీరును పరిశీలించి ప్రతి పట్టభద్రుడు తన ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని సూచించారు.ఉమ్మడి నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించిన ఓటు నమోదు కోసం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక హెల్ప్డెస్క్ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.విశ్రాంత ఉద్యోగులు, ప్రస్తుత ఉద్యోగులు, నిరుద్యోగ యువత, వ్యాపారులు, ఇతర రంగాల్లో ఉన్న పట్టభద్రులు ప్రతి ఒక్కరూ తమ ఓటును నమోదు చేసుకోవాలని రవీంద్ర కుమార్ కోరారు.ఓటు హక్కు మన బాధ్యత.. మన భవిష్యత్తుకు మన నిర్ణయం అనే స్ఫూర్తితో అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు తప్పనిసరిగా నమోదు చేసుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు