వాసవి క్లబ్, వాసవి వనిత క్లబ్ వ్యవస్థాపక దినోత్సవం
దేవరకొండ……..
వాసవి క్లబ్ మరియు వాసవి వనిత క్లబ్ గ్రేటర్ దేవరకొండ ఆధ్వర్యంలో వాసవి క్లబ్ పూర్వ అధ్యక్షుల సన్మానించే కార్యక్రమాన్ని వాసవి క్లబ్ మరియు వాసవి వనిత క్లబ్ గ్రేటర్ దేవరకొండ ఆధ్వర్యంలో నిర్వహించారు. వాసవి క్లబ్ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా దేవరకొండ వాసవి క్లబ్ మాజీ అధ్యక్షులు లకుమారపు మల్లయ్య కి మరియు వాసవి వనిత క్లబ్ గ్రేటర్ దేవరకొండ మాజీ అధ్యక్షురాలు బిల్దే మాధవి, పందిరి శ్రీదేవి, ఆలంపల్లి పద్మ, లకుమారపు సుకన్య, తోనుకునూరు విజయ, బెజవాడ దివ్యలను వాసవి క్లబ్ మరియు వాసవి వనిత క్లబ్ అధ్యక్షురాలు పందిరి జ్యోతి , వాసవి క్లబ్ అధ్యక్షులు అతుకూరి అంజనేయులు ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ కార్యదర్శి బిలీదే రవీందర్ వాసవి వనిత క్లబ్ కార్యదర్శి బెజవాడ మల్లేశ్వరి ,కోశాధికారి ఆలంపల్లి శిరీష నీల బుచ్చయ్య, సముద్రాల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.