లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ…!

గరిడేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు Sk. చాంద్ మియా ఆధ్వర్యంలో 33 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ అందచేత..

కీతవారిగూడెం గ్రామంలోని ఎస్సీ కాలనీలో పౌరసరఫరాల శాఖ మరియు భారీ నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు 33 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం గరిడేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్కే చాంద్ మియా గారి అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా ఎస్కే చాంద్ మియా గారు మాట్లాడుతూ, రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి 6 కిలోల సన్నబియ్యం పంపిణీ వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందన్నారు.

పేదల సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా 70 కుటుంబాలకు ఇండ్లు మంజూరైనాయి ఈరోజు33 మంది లబ్ధిదారులకు పట్టాలు అందజేయడం ఎంతో సంతోషకరమైన విషయమన్నారు. ఇంకా మిగిలిన 37 కుటుంబాలకు అతి త్వరలో పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుంది ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జానకమ్మ , కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కీత సోమయ్య , ఉప సర్పంచ్ చిత్తలూరు వీరస్వామి , వార్డు సభ్యులు బండారు సైదులు , బండారు అంజయ్య గారు, గుండు అజయ్ , ఎస్కే సఫియా మీరా , గూడెపు వెంకటేశ్వర్లు , కాంగ్రెస్ సీనియర్ నాయకులు టి. కృష్ణమూర్తి , మేళ్లచెరువు రామ్మూర్తి , కీత రామనాథం గారు, బొల్లెపల్లి సైదులు , ఎస్కే మీరా ,బండారు హుస్సేన్ , కాట్రేవుల వెంకటేశ్వర్లు గారు ఎస్ కే కాశిమ్ ఎస్ కే జానీ కీత అంజయ్య గారు, కడప అంజయ్య , నకెరకంటి నాగయ్య, బండారు చిన్న హుస్సేన్ , బండారు నరసింహారావు , పిడమర్తి వెంకటనర్సయ్య ,యూత్ నాయకులు గుండెపంగు నరేష్ , కడప విక్కీ తదితరులు పాల్గొన్నారు.

అలాగే గ్రామంలోని మహిళలు, పెద్దలు, యువత, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు కాంగ్రెస్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని 33 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.