శాంతిగూడెం గణేష్ ఉత్సవ కమిటీలో 35 000 కు లడ్డు ను వేలంపాటలో దక్కించుకున్న తోట లక్ష్మయ్య
డిండి మండలం శాంతి గూడెం గ్రామంలో గణేష్ ఉత్సవ కమిటీలో తొమ్మిది రోజులు పూజలు అందుకున్న గణనాథుడి దగ్గర లడ్డును శోభాయాత్రలో వేలంపాటలో తోట లక్ష్మయ్య దక్కించుకున్నారు
తోట లక్ష్మయ్య మాట్లాడుతూ లడ్డు ప్రసాదం వేలంపాటలో దక్కించుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నదని తెలంగాణ ప్రజలందరూ ఆయు ఆరోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని గణనాథుని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అని తెలియజేసినారు.
ఈ కార్యక్రమంలో
తోట లక్ష్మయ్య, తోట చరణ్ మండల బి ఆర్ ఎస్ మండల యూత్ అధ్యక్షుడు మేకల వెంకటేశ్వర్లు మిగతా గ్రామ పెద్దలు గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.