ఓం శ్రీ గురుభ్యోనమః
పంచాంగం.
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 29 – 08 – 2025,
వారం … భృగువాసరే ( శుక్రవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం,
వర్ష ఋతువు,
భాద్రపద మాసం,
శుక్ల పక్షం,
తిథి : *షష్ఠి* సా5.41 వరకు,
నక్షత్రం : *స్వాతి* ఉ10.32 వరకు,
యోగం : *బ్రహ్మం* మ2.18 వరకు,
కరణం : *తైతుల* సా5.41 వరకు,
తదుపరి *గరజి* తె4.43 వరకు,
వర్జ్యం : *సా4.46 – 6.31,*
దుర్ముహూర్తము : *ఉ8.17 – 9.07,*
మరల *మ12.26 – 1.16,*
అమృతకాలం : *తె3.23 – 5.09,*
రాహుకాలం : *ఉ10.30 – 12.00,*
యమగండం : *మ3.00 – 4.30,*
సూర్యరాశి : సింహం,
చంద్రరాశి : తుల,
సూర్యోదయం : 5.48,
సూర్యాస్తమయం: 6.17,
*_నేటి మాట_*
*మన గమ్యం ఎలా ఉండాలి??*
ఈరోజుల్లో మానవునకు information అక్కరలేదు,
Transformation కావాలి…
చాలా మంది మేము ఈ గ్రంథాలు చదువుతున్నాము, ఆ గ్రంధాలు చెడువుతున్నాము అని చెబుతారు,
గ్రంధాలు చదివే కొలదీ Doubts ఎక్కువై పోతున్నాయి.
ఈ జీవితం ఎప్పుడూ తెలుసు కోవడం లోనే కాలం వ్యర్ధం చేస్తున్నారు.
సాధన అనేది పుస్తక జ్ఞానం కాదు…
ఈ పెద్ద పెద్ద పుస్తకాలు, మనకు నిద్ర వచ్చి నప్పుడు తలక్రింద పెట్టు కోవడానికి పనికి వస్తాయి…
మన ఉచ్ఛ్వాస, నిస్వాసములే , (నేను దైవం) దివ్యత్వం.
దైవం అనుగ్రహం సంపాదించాలంటే, మనలోని రాగ,(attachment ) , భయ, క్రోధములు పోవాలి.
నామస్మరణ అనే సాధన చేస్తూ ఉండాలి.
*Some – సారం* అనగా కొంచెమైన సారము కలది ఈ సంసారం.
మనం ఆశించవలసినది భగవంతుని అనుగ్రహమే..
అతని అనుగ్రహముచేత అన్నీ మనకు లభిస్తాయి.
నామస్మరణే సాధనగా చేయాలి.
కొంత ప్రయత్నం చేస్తే, దైవానుగ్రహం లభిస్తుంది.
చదువు అనేది, madness గా కాకూడదు.
ఇవన్నీ పదిమందికీ చెప్పడానికి పనికివస్తాయి కాని, తనను తాను తెలుసు కోవడానికి పనికిరావు.
కనుక, మొట్టమొదట, నీ కాలాన్ని నువ్వు సార్థకం చేసుకో.
మానవునకు ఒక్క సంకల్పం, ఒక్క మార్గం, ఒక్క దైవం, ఒక్కగమ్యం ఉండాలి!!…
*_🌹శుభమస్తు🌹_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏